గంజాయి మొక్కలను కాల్చివేసిన కంభం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్.


 గంజాయి మొక్కలను కాల్చివేసిన కంభం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో,ఈరోజు కంభం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కు అందిన విశ్వసనీయ సమాచారము మేరకు, వారి సిబ్బందితో కలిసి అర్ధవీడు మండలం మాగుటూరు గ్రామంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది.

 ఈ తనిఖీలలో గ్రామ రెవెన్యూ అధికారులసమక్షంలో,మాగుటూరు గ్రామానికి చెందిన బి. తిరుపాల్ రైతు (48 సంవత్సరాలు), తండ్రి: పుల్లయ్య అనే వ్యక్తి, తనకు చెందిన పొగాకు పంట పొలంలో అక్రమంగా ఏడు (07) గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు గుర్తించడం జరిగింది.

అనంతరం, గ్రామ రెవెన్యూ అధికారుల సమక్షంలో సదరు గంజాయి మొక్కలను అక్కడికక్కడే పెకిలించడం జరిగింది.

 అనంతరం నిందితుడిని అతని పంట పొలంలోనే అదుపులోకి తీసుకొని, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కంభం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

Post a Comment

Previous Post Next Post