ఏలూరుజిల్లా లో అక్రమార్కులతో కుమ్మక్కు ఐన ఇరిగేషన్ సిబ్బంది.





 ఏలూరుజిల్లా లో అక్రమార్కులతో కుమ్మక్కు ఐన ఇరిగేషన్ సిబ్బంది.

ఇరిగేషన్ అధికారులపై అసహనం మరియు అనుమానం వ్యక్తం చేస్తున్న ప్రజలు.

ఇరిగేషన్ అధికారులు AE మరియు DE లపై వెంటనే చర్యలు తీసుకోవాలి.

 జంగారెడ్డిగూడెం క్రైమ్ 9మీడియా ప్రతినిధి.

ఇరిగేషన్ భూముల్లో అక్రమంగా ప్రవేశించి కొబ్బరి మొక్కలు మర్రి వేప నరికి టన్ను లెక్క కొబ్బరి చెట్లు అమ్మి సంపదను దోచుకుని దందాలు చేస్తున్న తాడువాయి గ్రామ భూస్వాము లైన యలమాటి దొరబాబు అనపర్తి వెంకటేశ్వరరావు పామర్తి రాజు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎంజీవరత్నం ఇరిగేషన్ అధికారులను డిమాండ్ చేశారు.

ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలం పరిధిలోని ఎర్ర కాలువ రిజర్వాయర్‌కు చెందిన తాడువాయి పంచాయతీలో గల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ భూముల్లో కొందరు భూస్వాములు అక్రమంగా ప్రవేశించి, ఇరిగేషన్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కొబ్బరి మొక్కలు 500 చెట్లను నరికి అమ్మి సొమ్ము చేసుకునే ఘటనలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం.జీ. వరత్నం ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి 2 శుక్రవారం ఇరిగేషన్ భూముల్లో కొబ్బరి ముక్కలు నరికే ప్రదేశాన్ని పర్యటించి ఆయన మాట్లాడుతూ రెండు ట్రాక్టర్లు 20 మంది జనంతో పది రోజుల నుంచి రాత్రి పగలు సైతం అక్రమంగా నీళ్లలో ఉన్న చెట్లను నరుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు

ఈ అక్రమాలపై తాను ఎన్నోసార్లు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రాజెక్టు తీవ్ర నష్టం కలుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు భూస్వాములతో అధికారులు కుమ్మక్కయ్యారనే అనుమానాలు బలపడుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి చెందిన ఇరిగేషన్ భూములను ఆక్రమించడాన్ని అడ్డుకోవాల్సిన అధికారులు మౌనం పాటించడం వెనుక లోతైన కారణాలు ఉన్నాయా అనే విషయంపై నిష్పక్షపాత విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఎర్రగాలువా మిగులు భూముల విషయంలో ఏ పోలవరం చిన్నవారిగూడెం. తాడువాయి వేగవరం. చక్కర దేవరపల్లి రైతులతో ఇరిగేషన్ అధికారులు సంబంధాలు పెట్టుకుని ఇరిగేషన్ చట్టానికి విరుద్ధంగా వ్యవసాయాలు చేస్తూ ప్రాజెక్టుకు నష్టం కలిగిస్తున్నారని తెలిపారు ఇదే గ్రామాల్లో ఉన్న పేదలు వెళ్లి పొట్టకూడు కోసం వ్యవసాయాలు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే అధికారులు భూస్వాములకు కొమ్ము కాయటం సిగ్గుచేటనే విమర్శించారు ఇంకోపక్క గ్రామంలో 

అక్రమంగా కొబ్బరి మొక్కలు మర్రి చెట్లు తాడి చెట్లు యాప చెట్లు నరుకుతున్న భూస్వాములపై మాత్రమే కాకుండా, ఈ అక్రమాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరిస్తున్న ఇరిగేషన్ అధికారలు.A.E. మరియు D.E. పై విచారణ జరిపి కూడా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ విషయమై చెట్లు నరుకుతున్న యజమానులను అడగగా అధికారుల సమాచారం ఇచ్చి వారి ప్రమేయంతోనే నరుకుతా ఉన్నామని అక్కడ చెట్లు నరుకుతున్న వారు చెబుతున్నారని దీని నిరూపించుకోవలసిన బాధ్యత ఇరిగేషన్ అధికారులకు ఉందని అన్నారు వెంటనే భూస్వాములపై కేసులు నమోదు చేసి ఇరిగేషన్ భూములను చెట్లను సంపదను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించకపోతే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని ఎం.జీవరత్నం హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పటాన్ మస్తాన్ కంపరం దుర్గారావు మరియు గ్రామ వ్యవసాయ కార్మికులుజి సూర్యకిరణ్ తదితరులు పాల్గొని నిరసన చేశారు.


Post a Comment

Previous Post Next Post