TR కు అధిక చార్జీలు వసూలు చేసే డీలర్లపై చర్యలు -ఉప రవాణా కమీషనర్ కె . ఎస్.ఎం.వి. కృష్ణారావు.

TR కు అధిక చార్జీలు వసూలు చేసే డీలర్లపై చర్యలు -ఉప రవాణా కమీషనర్ కె . ఎస్.ఎం.వి. కృష్ణారావు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.

         ఏలూరు, జనవరి, 8 : వాహనాల తాత్కాలిక నమోదు (TR) కు అధిక చార్జీలు వసూలు చేసే డీలర్లపై చర్యలు తీసుకుంటామని ఉప రవాణా కమీషనర్ కె . ఎస్.ఎం.వి. కృష్ణారావు హెచ్చరించారు. ఏలూరు జిల్లా ఉప రవాణా కమీషనర్ కార్యాలయంలో గురువారం (Temporary Registration - TR) ఛార్జీలపై డీలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ వాహనాల తాత్కాలిక నమోదు సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జీలను మాత్రమే వినియోగదారుల నుంచి వసూలు చేయాలని, అదనపు లేదా అనదికార వసూళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావివ్వరాదని హెచ్చరించారు. అలాగే, ప్రతి వాహన షోరూంలో TR ఛార్జీలు మరియు రుసుముల వివరాలను స్పష్టంగా చూపించే బోర్డులను తప్పనిసరిగా ప్రదర్శించాలనీ, రవాణా కమీషనర్ జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలనీ సూచించారు. ఈ మేరకు ఛార్జీల జాబితాను డీలర్లకు అందజేశారు. అదేవిధముగా తాత్కాలిక నమోదు సమయంలో అధిక వసూళ్లపై వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులను గణనీయంగా తగ్గించే దిశగా ప్రతి డీలర్ బాధ్యతతో వ్యవహరించాలని డీటీసీ కోరారు. అన్ని పోరూంలలో ఫీజు వివరములతో బోర్డ్సు పెట్టని ల్, అధిక ఫీజుల వసూలు వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిటిసి హెచ్చరించారు.

      సమావేశంలో ఆర్టీవో (ఇంచార్జ్ ) ఎస్ బి శేఖర్, మోటార్ వాహన ఇన్స్పెక్టర్స్ బి.భీమారావు, జి.ప్రసాదరావు, పి.రమేష్ బాబు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం.రాము, ఎం. ఆనంద కుమార్ తో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 మంది వాహన డీలర్లు పాల్గొన్నారు.          

Post a Comment

Previous Post Next Post