ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పర్యటీంచిన విద్యుత్ శాఖ మంత్రి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ మీడియా ప్రతినిధి దాసరి యోబు.
కూకట్లపల్లిలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి. బల్లికురువ మండల స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి. శిథిలమైన కూకట్లపల్లి వెటర్నరీ ఆసుపత్రిని పరిశీలించిన మంత్రి గొట్టిపాటి. అద్దంకి నియోజకవర్గం కూకట్లపల్లి గ్రామంలో 113 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి గొట్టిపాటి. ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించిన మంత్రి,దాతల సాయంతోనే నియోజకవర్గం వ్యాప్తంగా విద్యార్థులు సైకిళ్ల పంపిణీచేశారు.
మార్చి నాటికి నియోజకవర్గంలో 11 వేల సైకిళ్ల పంపిణీ పూర్తి చేస్తామన్నారు,రాజకీయ రంగులు, గుర్తులతో సంబంధం లేకుండా విద్యార్థుల లబ్ధి చేకూర్చుతున్నామన్నారు, ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంగా ఉపాధ్యాయులు పని చేయాలని చెప్పారు. మెరుగైన విద్యావ్యవస్థ కోసం మెగా డీఎస్సీతో ఉపాధ్యాయుల భర్తీని చేపట్టామన్నారు.అద్దంకి పారిశ్రామిక అభివృద్ధి కోసం 1000 ఎకరాల్లో సోలార్ ప్యానెల్ తయారీపరిశ్రమఏర్పాటుచేస్తామన్నారు, ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


