ఘనంగా బాలిక దినోత్సవం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈరోజు ఒంగోల్ పివిఆర్ బాలికల హై స్కూల్ నందు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిణి శ్రీమతి సువర్ణ మరియు విద్యాశాఖ అధికారిణి శ్రీమతి రేణుక వారి సంయుక్త ఆధ్వర్యంలో వకృత్వ, చిత్రలేఖన, పద్య పాఠ్యాంశాల పై పోటీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ షేక్ ఇబ్రహీం షరీఫ్, సెక్రటరీ, న్యాయ సేవాధికార సంస్థ, ప్రకాశం జిల్లా వారు పాల్గొన్నారు.
సెక్రటరీ వారు మాట్లాడుతూ బాల్య వివాహాల నిరోధ చట్టం, పోక్సో చట్టం, బాలల సంరక్షణకు సంబంధించిన చట్టాలు వివరించారు. చిన్న వయసులో పెళ్లిళ్లు జరగడం వలన కలిగే నష్టాలను వాటి ద్వారా వచ్చే శారీరక మానసిక రుగ్మతలను వివరించారు.
జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి రేణుక బాలికలకు విద్యాశాఖ ద్వారా అందించబడే సేవలను, విద్యార్థినులకు వున్న ప్రత్యేక అవకాశాలను, ప్రభుత్వం కేజీబీవీ ద్వారా బాలికలకు విద్య అందిస్తున్నామని తెలిపారు.
జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి శ్రీమతి సువర్ణ ఈ శాఖ ద్వారా అందించే పలు సేవలనుకుటుంబ వ్యవస్థలో లోపాల వల్ల బాలికలు పడే ఇబ్బందులను వాటికి తీసుకోవలసిన జాగ్రత్తలను, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 ద్వారా కలిగే ఉపయోగాలను తెలియపరిచారు.
స్టెప్స్ సీఈఓ శ్రీ శ్రీమన్నారాయణ మాట్లాడుతూ తాను కూడా ఈ స్కూల్ పూర్వ విద్యార్థినే అని వారు చదువుకున్న రోజులను గుర్తు చేసుకుంటూ అప్పటి పరిస్థితులను ఇప్పుడున్న పరిస్థితులను, బాలికలకు ఉన్న ప్రత్యేక అవకాశాలను వివరించారు.
జిల్లా బాలల సంరక్షణ విభాగం న్యాయ మరియు పరివీక్షణ అధికారి బి రత్న ప్రసాద్ 18 సంవత్సరాల లోపు వయసు గల వారికి గల రక్షణ సంరక్షణ అంశాలను వివరించారు.
ఒంగోలు సిడిపిఓ శ్రీమతి కళ్యాణ వర్మ, ఏ సి డి పి ఓ శ్రీమతి వై అంజమ్మ, సూపర్వైజర్ శ్రీమతి అనురాధ, శ్రీమతి పిచ్చమ్మ, శ్రీమతి రమాదేవి, శ్రీమతి ఆదిలక్ష్మి మరియు ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా బాలల సంరక్షణ విభాగం వారు పాల్గొని వారి సేవలను తెలియపరిచారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ వారు బాలికలతో బాల్య వివాహ రహిత భారత్ ప్రతిజ్ఞ చేయించారు.విద్యార్థినిలు ఆటపాటలతో అలరించారు.

