అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌ మరియు సబ్ డివిజన్ కార్యాలయమును సందర్శించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.


 ​  అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌ మరియు సబ్ డివిజన్ కార్యాలయమును సందర్శించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.

​ గంజాయి రవాణాపై పటిష్ట చర్యలు.

​ సైబర్ నేరాలపై విస్తృత అవగాహన.

​ మహిళా భద్రతకు ప్రథమ ప్రాధాన్యత.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి.

జోనల్ ఇంచార్జి పి. మహేశ్వరరావు.

​ అనకాపల్లి పట్టణం. జనవరి 23: వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, నేడు అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ మరియు సబ్ డివిజన్ కార్యాలయాన్ని సందర్శించారు. స్టేషన్ రికార్డులు, శాంతిభద్రతల నిర్వహణ మరియు కేసుల దర్యాప్తు పురోగతిని ఆయన నిశితంగా పరిశీలించి, సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

 ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం కావాలని ఆకాంక్షించారు.

మాదకద్రవ్యాల నిర్మూలన

​గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పటిష్ట చర్యలు చేపట్టాలి. యువత పెడదారి పట్టకుండా విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహించి, డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలని ఆదేశించారు.

​సైబర్ నేరాల పట్ల అప్రమత్తత

​సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, ఆన్‌లైన్ ఆర్థిక నేరాల పట్ల సామాన్య ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు.

​మహిళా భద్రత & ఫ్రెండ్లీ పోలీసింగ్

​మహిళల రక్షణ విషయంలో అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల (GMSK) సహాయంతో క్షేత్రస్థాయిలో మహిళలకు పూర్తి భరోసా కల్పించాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తిస్తూ 'ఫ్రెండ్లీ పోలీసింగ్' అమలు చేయాలని స్పష్టం చేశారు.

పెండింగ్‌లో ఉన్న గ్రేవ్ మరియు నాన్-గ్రేవ్ కేసులను సత్వరం ఛేదించాలి. నేరస్థులకు శిక్ష పడేలా పక్కా ఆధారాలతో చార్జ్ షీట్లను నిర్ణీత సమయంలోగా కోర్టులో దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు.రోడ్డు భద్రత

​రోడ్డు ప్రమాదాల నివారణకు నిరంతరం 'డ్రంక్ అండ్ డ్రైవ్' తనిఖీలు నిర్వహించాలని, హెల్మెట్ మరియు సీటు బెల్ట్ ధరించేలా వాహనదారుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు.

విధుల నిర్వహణలో క్రమశిక్షణతో పాటు సిబ్బంది ఆరోగ్యం, వ్యక్తిగత సమస్యల పట్ల ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ చూపారు. సిబ్బందితో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, తగిన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

​ఈ కార్యక్రమంలో అనకాపల్లి సబ్-డివిజన్ డీఎస్పీ శ్రీమతి ఎం.శ్రావణి, పట్టణ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకట నారాయణ, ఎస్సైలు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post