ఘనంగా జాతీయ ఓటరు హక్కు దినోత్సవం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఓటు హక్కు యొక్క ప్రాధ్యానతను ప్రజలకు తెలియచేయడం, ఎన్నికల సమయంలో ఓటర్లను భాగస్వాములను చేయడమే జాతీయ ఓటరు దినోత్సం యొక్క ముఖ్యఉద్దేశ్యమని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లోని పి జి ఆర్ ఎస్ మందిరములో జరిగిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో జాయింట్ కలెక్టర్, ఆర్ గోపాల క్రిష్ణ పాల్గొని, జ్యోతి ప్రజ్వలవ గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్, అధికారులు, విద్యార్థులతో కలసి ఓటర్ల ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ మాట్లాడుతూ, ఓటు హక్కు వినియోగించుకోవడం మనందరి బాధ్యత అన్నారు.
ఓటర్ నమోదు, ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన కోసం పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.
అందులో భాగంగానే ప్రతి ఏటా జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు.
విశాలమైన భారతదేశం లో దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్న అతి పెద్ద పండుగ జాతీయ ఓటర్ల దినోత్సం అని తెలిపారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలో భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా మనగడ సాగించేదా అనే సందేహం ప్రపంచదేశాలకు ఉండేదని, అలాంటి సందేహాన్ని పటాపంచలు చేస్తూ ఓటు హక్కు అనే వజ్రాయుధంతో ఇతర దేశాలకు ఆదర్శంగా, బలమైన ప్రజాస్వామ్య దేశంగా నిలుస్తూ భారత దేశం యొక్క గొప్పతనాన్ని, ఓటు హక్కు ప్రాధాన్యత, ప్రాముఖ్యత ను తెలియచేయడం జరిగిందన్నారు.
ప్రపంచ దేశాల్లో ఎ దేశంలో లేనంత మంది ఓటర్లను కలిగి పారదర్శకంగా ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించుకోవడం జరుగుచున్నదన్నారు.
సామాన్య పౌరుడుగా గర్వపడాల్సిన అంశమేమంటే, ఓటు హక్కుతో తనకు నచ్చిన వ్యక్తిని తమ నాయకుడిగా ఎన్నికోవచ్చన్నారు.
1950 జనవరి 25 భారత ఎన్నికల సంఘం ఏర్పడి నాటి నుండి ఎన్నికల ప్రక్రియలో అనేక సంస్కరణలు, మార్పులు తీసుకువచ్చి అత్యంత పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు.
ఒక వ్యక్తి రెండు ఓట్లు కలిగి ఉండరాదని, చనిపోయిన వ్యక్తికి ఓటు ఉండరాదు అనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఓటర్స్ స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుచున్నదన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలన్న లక్ష్యంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుచున్నదన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు మాట్లాడుతూ, ఓటర్లలో చైతన్యం కోసం జిల్లా యంత్రాంగం పెద్దఎత్తునఅవగాహనాకార్యక్రమాలనునిర్వహిస్తోందన్నారు.
దేశానికి యువత వెన్నుముకలాంటి వారన్నారు. 18 సంవత్సరాలు నిడిన యువతీ యువకులంతా తప్పనిసరిగా ఓటు హక్కు పొందాలని సూచించారు.
ఈ సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన యువ ఓటర్లకు ఎపిక్ కార్డులను అందచేయడంతో పాటు, సీనియర్ ఓటర్లను సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా ఓటర్స్ స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రక్రియలో విశేష కృషి చేసిన బిఎల్ఓలకు, రెవెన్యూ అధికారులకు ప్రశంసా పత్రాన్ని అందచేయడం జరిగింది.
వక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందచేసారు.
ముందుగా ఓటర్ అవగాహన ర్యాలీని, సంతకాల క్యాంపెయిన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్దిఒ శ్రీమతి లక్ష్మి ప్రసన్న, జిల్లా విద్యాశాఖాధికారి శ్రీమతి రేణుక, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర రావు, డిఆర్డిఎ పిడి.నారాయణ, ఉద్యాన శాఖాధికారి గోపి చంద్, జిల్లా ఓటర్ వాచ్ అధికారి వినియోగదారుల సంఘం సభ్యులు నాగేశ్వర రావు, వివిధ రాజకీయ పార్టీల ఎన్నికల ప్రక్రియ ప్రతినిధులు , వివిధ కళాశాలల విద్యార్ధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు,

