అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.


 అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

కిడ్నీ వ్యాధి తో బాధపడుతున్న వ్యక్తికి 40,000/- వేల రూపాయలు ఆర్ధిక సాయం అందించిన - బోనేని వెంకటేశ్వర్లు.

మార్కాపురం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల గ్రామానికి చెందిన కాశీరావు రెండు కిడ్నీలు చెడిపోయి నంద్యాల లోని వైద్యశాలలో చికిత్స పొందుతు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుసుకున్న అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు వెంటనే స్పందించి అయనే స్వయంగా నంద్యాల లోని వైద్యశాలకు వెళ్లి కాశిరావును కలిసి నేను ఉన్నా అంటూ అభయం ఇచ్చి వెంటనే అతని కి 40,000/- అక్షరాలా నలభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసారు. ఈ కార్యక్రమం లో అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు కార్యదర్శి పందనబోయిన భూపాల్ మరియు కాసిరావు నిరంజన్ పాల్గొన్నారు,

Post a Comment

Previous Post Next Post