స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
ఆత్మ గౌరవాన్ని ఇచ్చేది శుభ్రత మాత్రమేనని, ఆ శుభ్రతను ప్రతి ఒక్కరూ పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన స్వచ్చ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పిలుపునిచ్చారు.
శనివారం సంతనూతలపాడు నియోజకవర్గం, మద్దిపాడు మండల కేంద్రంలో జరిగిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు , శాసన సభ్యులు శ్రీ బిఎన్ విజయ కుమార్ తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యర్ధాల సేకరణ కోసం ఉద్దేశించిన స్వచ్ఛ రధాన్ని మరియు మద్దిపాడు రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కూరగాయలు, పప్పు దినుసులు, సుగంధ ద్రవ్యాలు, తృణ ధాన్యాలు, సిరి ధాన్యాలు, పండ్లును క్షేత్రస్థాయిలో అమ్ముకునేలా జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ సహకారం తో 12లతో మంజురైన మినీవ్యాన్ ను జిల్లా కలెక్టర్ రాజాబాబు, శాసన సభ్యులు శ్రీ విజయకుమార్ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో భాగస్వాములై గ్రామాలను చెత్త రహితంగా తీర్చిదిద్దేలా కృషిచేయాలన్నారు. గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెలా మూడో శనివారం ప్రత్యేకమైన థీమ్ తో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుచున్నదన్నారు. రాష్ట్రాన్ని పరిశుభ్రత కలిగిన రాష్ట్రంగా దేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నందని, ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు.
పరిశుభ్రమైన పరిసరాలు, హరిత వాతావరణం ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. పరిశుభ్రత విషయంలో అందరి ఆలోచనలూ మారాలని, ఇల్లు ఒక్కటే కాదు మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛతలో మద్దిపాడు గ్రామం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలన్నారు.
సహజ వనరులతో పండించిన ఉత్పత్తులను క్షేత్ర స్థాయిలో అమ్మేలా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారంలో మద్దిపాడు రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మంజురైన వ్యాన్ ను ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగిందని,
రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి సంవత్సరం జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.
సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై ప్రతి ఒక్కరూ భాద్యతతో తమ వంతు తోడ్పాటు అందిస్తూ వారిని ప్రోత్సహించాలన్నారు.
సంతనూతలపాడు శాసన సభ్యులు బిఎన్ విజయ కుమార్ మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. స్వచ్ఛత ప్రతీఒక్కరి జీవితంలో భాగం కావాలని పిలుపునిచ్చారు.
పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛత గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకే ప్రతీనెలా 3వ శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రతీనెలా ఒక ముఖ్యమైన అంశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి ఇంటి నుండి వేరు చేసిన తడి చెత్త, పొడి చెత్తను సంపద సృస్టించేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. ప్రజలు కూడా స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములై స్వర్ణాంధ్ర ప్రదేశ్ కలలను సాకారం చేయాలని కోరారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మద్దిపాడు లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు.
5 కోట్ల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని,
ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలచే స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.
ముందుగా జిల్లా కలెక్టర్, శాసన సభ్యులు మద్దిపాడులో జీరో గ్యాప్ సానిటేషన్ ఆంధ్ర థీమ్ తో ఇంటి వద్ద కంపోస్టింగ్ (సస్టైనబుల్ సానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్) పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటేశ్వర్లు, డ్వామా పిడి జోసెఫ్ కుమార్, మండల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ రాజాబాబు, శాసనసభ్యులు తో కలసి గుండ్లకమ్మ ప్రాజెక్టు ను సందర్శించి ఇన్ టెక్ వేర్ మరియు పంపు హౌస్ ను పరిశీలించారు.


