ప్రాథమిక పాఠశాల ఆకస్మిక తనిఖీ.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం: మండలంలోని ఎంఆర్ జంగంగుంట్ల ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ-2 టి.శ్రీనివాసులు ఈరోజు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాల వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థుల సంఖ్య, హాజరు, త్రాగునీరు, మరుగుదొడ్లు, పాఠశాల పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న గ్యారెంటీడ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసి 75 రోజుల కార్యచరణ ప్రణాళికల అమలు, ఉపాద్యాయుల రికార్డులు, విద్యార్థుల రాత పుస్తకాలను పరిశీలించారు. చదివించడం, వ్రాయించడం ద్వారా తెలుగు, ఆంగ్లం,గణితంలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
