గంజాయిపై ఉక్కుపాదం కార్డన్ అండ్ సెర్చ్, అవగాహన ర్యాలీ, యాంటీ గంజాయి ప్రతిజ్ఞతో ప్రకాశం పోలీసులు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , ప్రకాశం పోలీసులు గంజాయి అక్రమ కార్యకలాపాల నియంత్రణలో భాగంగా, ఒంగోలు డీఎస్పీ పర్యవేక్షణలో,చిమకుర్తి సీఐ, సమక్షంలో, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది సమన్వయంతో చీమకుర్తి మండలం యల్లయ్య నగర్ ప్రాంతంలో విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గంజాయి నిల్వలు, రవాణా, వినియోగానికి పాల్పడుతున్నారనే అనుమానంతో ఉన్న ఇళ్లలో ఇంటెన్సివ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడంతో పాటు, యల్లయ్య నగర్ పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
అక్రమ గంజాయి కార్యకలాపాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వబోమని పోలీసులు స్పష్టం చేశారు.
అదేవిధంగా, గంజాయి సాగు మరియు వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రజలతో యాంటీ గంజాయి ప్రతిజ్ఞ చేయించారు, గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
గంజాయి వంటి మత్తు పదార్థాలపై యుద్ధంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, ఎవరైనా అక్రమ గంజాయి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
గంజాయి నియంత్రణ, యువత భవిష్యత్తు రక్షణ, సమాజ భద్రత లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు తమ చర్యలను మరింత కఠినతరం చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు.


