జాతీయ స్పూర్తి ఉట్టిపడేలా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాలి-జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి.


జాతీయ స్పూర్తి ఉట్టిపడేలా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాలి-జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

       ఏలూరు,జనవరి,19: జాతీయ స్పూర్తి  ప్రస్ఫుటించేలా,పండుగ వాతావరణంలో  గణతంత్ర దినోత్సవ వేడుకలను   నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని  అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశమందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ  తో కలిసి ఈనెల 26వ తేదీన ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే  గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి సమీక్ష నిర్వహించారు.

 ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు  విస్త్రృత ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే గణతంత్రదినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధిత శాఖల సమన్వయంతో సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.   ప్రధాన వేదికు సంబంధించి ఏర్పాట్లు ప్రొటోకాల్ కు అనుగుణంగా రూపొందించాలన్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే అతి ముఖ్య అతిధులకు, విఐపిలు, ఇతర ప్రజా ప్రతినిధులకు, సాధారణ ప్రజానీకానికి, ప్రత్యేక గ్యాలరీలు, సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.   భధ్రతాపరంగా బ్యారికేడ్, గ్రౌండ్ లెవలింగ్ భాధ్యత పోలీస్,ఆర్ అండ్ బి శాఖలు అధికారులు ఏర్పాట్లు  చేయాలన్నారు.  జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జాతీయ స్పూర్తి, సమగ్రత ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. వివిధ శాఖల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పధకాలపై  హౌసింగ్, పశు సంవర్ధకశాఖ, ఐసిడిఎస్, మెప్మా, విద్యాశాఖ, ఉధ్యానశాఖ, వ్యవసాయం, మత్స్యశాఖ, ఐటిడిఏ కె.ఆర్.పురం, రీసర్వే( రెవిన్యూ సదస్సులు, పిజిఆర్ఎస్)  స్టాల్స్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.   జిల్లాలోని వివిధ శాఖల ప్రగతిని ప్రతిబింబించేలా ప్రగతి శకటాలను ప్రదర్శించాలన్నారు.   ప్రభుత్వ  శాఖల్లో ఉత్తమ పనితీరు కనబరిచే అధికారులు, సిబ్బందికి ప్రసంసా పత్రాలు అందించేందుకు ఈనెల 23వ తేదీలోగా జిల్లా రెవిన్యూ అధికారికి ప్రతిపాధనలు సమర్పించాలన్నారు. శానిటేషన్, త్రాగునీరు ఏర్పాట్లను నగరపాలక సంస్ధ కమీషనరు పర్యవేక్షించాలన్నారు.

              డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, జెడ్పి సిఇఓ శ్రీహరి,.  డిఇఓ వెంకటలక్ష్మమ్మ,  నగరపాలక సంస్ధ కమీషనరు ఎ. భానుప్రతాప్,   వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post