జిల్లా నూతన డి ఎమ్ హెచ్ వో గా వాణిశ్రీ బాధ్యతలు స్వీకరణ.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
మార్కాపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారునిగా వాణిశ్రీ బాధ్యతలు చేపట్టారు.
సోమవారం సాయంత్రం స్థానిక కోర్టు సెంటర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ నూతన జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ కృషి చేస్తారని అన్నారు.
జిల్లాలోని అన్ని పిహెచ్సి సెంటర్లలో వైద్యులు ఒకరు అర తప్ప అందరూ ఉన్నారని అన్నారు.
ఆరోగ్య క్లినిక్ ల ద్వారా వైద్య సేవలు మరింత దగ్గరయ్యాయని అన్నారు. నూతన జిల్లా వైద్య అధికారిని గా బాధ్యతలుస్వీకరించిన సందర్భంగా డాక్టర్ వాణిశ్రీకి డాక్టర్ కే. రాహుల్ ఎన్జీవో అసోసియేషన్ నాయకులు డి. నాగేందర్ రెడ్డి, మరియు వైద్యులు పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు,
