జనసేన పార్టీకి జనసైనికులు, వీర మహిళలు బలం.


 జనసేన పార్టీకి జనసైనికులు, వీర మహిళలు బలం.

అధికారంలో ఉన్న లేకున్నా ప్రజల పక్షాన పోరాడే తత్వం జన సైనికులు, వీర మహిళల్లో ఉంది.

నిబద్ధత, క్రమశిక్షణ, పోరాడే తత్వాలను పవన్ కళ్యాణ్  మొదటినుండి జన సైనికులు వీర మహిళలకు నేర్పారు.

జనసైనికులు, కార్యకర్తల సమావేశంలో ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు వెల్లడి.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

జనసేన పార్టీ ఏలూరు, జనవరి 11:- జనసేన పార్టీకి జన సైనికులు, వీర మహిళలు అసలైన బలమని, వారి కృషితోనే పార్టీ పటిష్టంగా ఉందని ఏపీఎస్ఆర్టీసీ జూన్ 2 చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసైనికులు అభిమతం మేరకే జనసేన పార్టీ ముందుకు సాగుతుందన్నారు. మనం అధికారంలో ఉన్న, లేకున్నా, ప్రజల కోసం పోరాడే జనసైనికులు, వీర మహిళలు ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ మాత్రమే అని అన్నారు. నిబద్ధత, క్రమశిక్షణ, ప్రజల కోసం పోరాడే తత్వాలను జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుండి జనసైనికులకు నేర్పారన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా జనసేన కార్యకర్తలు, వీర మహిళల తరఫున తాను పోరాడుతానని ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు ఉద్ఘాటించారు. జనసేనలో జనసైనికులు, వీర మహిళలకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందని, కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక వ్యవస్థను రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేస్తారని అన్నారు. రాబోయే రోజుల్లో ఏలూరులో పలు కమిటీలను వేయనున్నామని, అందుకు జనసైనికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎవరైతే పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్నారో, వారికి జనసేన పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. ఏలూరులో సైనికులు జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్  ఆశయాలను కొనసాగించాలని, ఎన్డీఏ కూటమికి అంకితభావంతో కట్టుబడి పని చేయాలన్నారు. 50 డివిజన్ లోను పోటీ చేసే శక్తిని జనసైనికులు, వీర మహిళలు, నాయకులు సమాయత్తం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఏలూరు జనసేన పార్టీలో పలు కమిటీలను వేయనున్నామని, దానికి ప్రతి ఒక్కరూ సంసిద్ధం కావాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమ్మ కార్పోరేషన్ డైరెక్టర్ కావూరి వాణి, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు వీరంకి పండు, కార్పోరేటర్లు కోయ సత్తిబాబు, పొలిమేర దాసు, క్లస్టర్ ఇంచార్జీలు, డివిజన్ ఇంచార్జీలు, వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు, మెగా అభిమానులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post