స్వామి వివేకానంద కు ఘన నివాళులు అర్పించిన ప్రకాశం కలెక్టర్, ఎస్పీ.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలుఒంగోలు, భారతదేశం యొక్క సంప్రదాయం, సంస్కృతీ, గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద అని, వారిని ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత స్పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్, పి. రాజాబాబు పేర్కొన్నారు.
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని సోమవారం ఉదయం కలెక్టరేట్లోని విసి హల్లో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జిల్లా ఎస్పి వి. హర్షవర్ధన్ రాజుతో కలసి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, పి,రాజాబాబు మాట్లాడుతూ, భారతదేశం యొక్క సంప్రదాయం, సంస్కృతీ, గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద అని, వారిని ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత స్పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యువత దేశానికి వెన్నుముక వంటి వారని, వారిని అన్నీ రకాలుగా ప్రోత్సహిస్తూ యువతకు స్పూర్తి నింపే ఎన్నో స్పుర్తిదాయక రచనలు గావించి ప్రపంచానికి స్పూర్తిగా నిలిచినా స్వామి వివేకానందను అందరు ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలన్నారు. ఒక ఆలోచనను చేపట్టండి, ఆ ఒక్క ఆలోచనను మీ జీవితంగా చేసుకోండి - దాని గురించి ఆలోచించండి, దాని గురించి కలలు కనండి, ఆ ఆలోచనపై జీవించండి, విజయానికి ఇదే మార్గమని యువతకు తెలియచేస్తూ, ఇలాంటి ఎన్నో స్పుర్తిదాయక రచనలు చేసిన "స్వామి వివేకానంద" జయంతిని యువజన దినోత్సంగా కూడా మనమంతా జరుపుకోవడం సంతోషదాయకమన్నారు.
జిల్లా ఎస్పి శ్రీ వి. హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, స్వామి వివేకానంద గారు అందరికి స్పుర్తిదాయకమని, నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడవాలన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా మన దేశ సంస్కృతిని, చరిత్రను తెలియచేసిన మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద అని అన్నారు.
అయన మనందరికీ ఆదర్శప్రాయుడని, వారు ఏదైతే విలువలు, ఆదర్శాలతో జీవించారో ఆ విలువలు, ఆదర్శాలతో మనమంతా సమాజంలో జీవిస్తే దేశం ఎంతో అభివృద్ధి వైపు పయనిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొని స్వామి వివేకానంద కు ఘన నివాళులు అర్పించారు.
