రోడ్డు ప్రమాదాల నివారణ పై ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నబేస్తవారిపేట ఎస్సై.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఉమ్మడి ప్రకాశం ఎస్పీ వారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలంలోని పందిళ్ళపల్లి టోల్ ప్లాజా దగ్గర వాహనాల తనిఖీ నిర్వహించడమైనది అందులో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి హెల్మెట్ ధరించిన వారిని మరియు మైనర్ డ్రైవింగ్ వారికి కేసు నమోదు చేసి జరిమానా వివరించారు.
ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు నిర్లక్ష్య డ్రైవింగ్, అధిక వేగం, హెల్మెట్ ధరించకపోవడం, మద్యం మత్తులో వాహనం నడపడం మంచిది కాదని చెప్పారు.
అలాగే ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు.
కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, లైన్ డిసిప్లిన్, ఓవర్ స్పీడింగ్‌కు దూరంగా ఉండడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రజల భద్రతే లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసు శాఖ రోడ్డు ప్రమాదాల నివారణకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తుందని బేస్తవారిపేట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రవీంద్రారెడ్డి తెలిపారు,
