కంభం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా బాదం కిషోర్ నియమాకం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం మండల కేంద్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో మండల కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈసమావేశంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు. ఉమ్మడి ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్.జె. వి.నారాయణ పాల్గొని వారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కంభం మండల అధ్యక్షులుగా బాదం కిషోర్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఆయనకు మండల అధ్యక్షుడిగా నియామక పత్రాన్ని అందజేశారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా. గుండె పూడి వెంకటరమణ శర్మ. కోశాధికారిగా మురారి. ఉపాధ్యక్షుడిగా. మునగాల వెంకట మురళీకృష్ణ. మునగాల బాలకృష్ణ.తరటి సువర్ణ. నాగ మల్లేశ్వరి బాయ్. కొర్రపాటి రంగ లక్ష్మి. కార్యదర్శి. వల్లం శెట్టి విజయభాస్కర్. బాదం లక్ష్మీదేవి. బండి భూపతిరెడ్డి. నల్లబోతుల హరికిరణ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బాదం కిషోర్ మాట్లాడుతూ ఈరోజు నన్ను అధ్యక్షుడిగా నియమించిన జిల్లా అధ్యక్షులకు జిల్లా జనరల్ సెక్రెటరీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నామీద నమ్మకముతో మండల అధ్యక్షుడు పదవిని ఇచ్చారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయక పార్టీని బలోపేతం చేసి కార్యకర్తలకు అన్ని విధాల సహాయ సహకారిగా ఉండి వారి సమస్యలు నా సమస్యలుగా భావించి అందరికీ సమన్వయంతో అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ జిల్లా మాజీ ట్రెజరర్ బాదం మనోహర్. బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు భావనాసి. రామాంజనేయులు. గిద్దలూరు పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ శంకర్. కంభం మార్కెట్ యార్డ్ డైరెక్టర్. శ్రీమతి బాదం పద్మావతి. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
