డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక స్పెషల్ టీం కేటాయించాలి (డివైఎఫ్ఐ).


 
డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక స్పెషల్ టీం కేటాయించాలి (డివైఎఫ్ఐ).
 మహిళలపై దాడులు అరికట్టాలి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్య కిరణ్ డిమాండ్.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్. 

జంగారెడ్డిగూడెం జనవరి 10 పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసంఘాల కార్యాలయంలో డ్రగ్స్ నిర్మూలన అంశంపై ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న డ్రగ్స్ సంస్కృతి యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సమావేశంలో సూర్యకిరణ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల పోలీసు శాఖ చేపడుతున్న డ్రగ్స్ దాడుల్లో భారీగా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు పట్టుబడుతున్నప్పటికీ, మరోవైపు డ్రగ్స్ వినియోగం తగ్గకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. గతంలో విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం డ్రగ్స్‌కు సంబంధించిన కేసులు ఏటేటా పెరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాలు కూడా ఈ మత్తు మాయలో చిక్కుకుంటున్నాయని తెలిపారు. డ్రగ్స్ ప్రభావంతో యువత హింసకు, నేరాలకు అలవాటుపడి హత్యలు, దాడులు, దోపిడీలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
డ్రగ్స్ నిర్మూలనలో అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, మాఫియా వ్యవస్థాత్మకంగా పనిచేస్తుండటంతో పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్న పరిస్థితి ఉందన్నారు. కేవలం పట్టుకునే చర్యలకే పరిమితం కాకుండా, డ్రగ్స్ సరఫరా మూలాలను, వెనుక ఉన్న ప్రధాన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక స్పెషల్ టీంను కేటాయించి, నిరంతర నిఘా మరియు కఠిన చట్ట అమలు చేయాలని డిమాండ్ చేశారు.
      ఈ సమావేశంలో పాల్గొన్న ప్రజాసంఘాల నాయకులు సిఐటియు మండల కన్వీనర్ పీఎస్ రావు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్, ఈవో ఏ జిల్లా కార్యదర్శి ఎస్కే సుభాషిణి, మాట్లాడుతూ, డ్రగ్స్ సమస్య కేవలం పోలీసు సమస్యగా కాకుండా సామాజిక సమస్యగా మారిందని అన్నారు. పాఠశాలలు, కళాశాలల స్థాయిలోనే డ్రగ్స్ ప్రభావం కనిపిస్తోందని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ సంఘాలు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు పునరావాస చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశంలోవంగా గోపి,  ఆశీర్వాదం, సుభానితదితరులు పాల్గొని డ్రగ్స్ నిర్మూలనపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

Post a Comment

Previous Post Next Post