ట్రాఫిక్ నిబంధనలపై ఎల్ఈడి (LED) స్క్రీన్‌ల ద్వారా వినూత్న అవగాహన: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు.
అనకాపల్లి పట్టణం,జనవరి:16
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా, వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ సరికొత్త పంథాను అనుసరిస్తోంది. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీమతి ఎం.శ్రావణి వారి ఆదేశాల మేరకు, అనకాపల్లి పట్టణంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన నెహ్రూ చౌక్ నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ఎల్ఈడి (LED) స్క్రీన్ ద్వారా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమం గురించి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎం.వెంకట నారాయణ మాట్లాడుతూ, ప్రజలకు దృశ్యరూపంలో (Visuals) సందేశాలు పంపడం ద్వారా ట్రాఫిక్ నిబంధనల పట్ల మెరుగైన మార్పు వస్తుందని పేర్కొన్నారు.
హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల కలిగే ప్రాణాపాయం, ప్రమాద తీవ్రతపై వీడియోల ద్వారా అవగాహన.
ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాల పనితీరు మరియు నిబంధనలు ఉల్లంఘిస్తే ఆటోమేటిక్ చలానాలు ఎలా పడతాయో వివరణ.
డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే అనర్థాలు, శిక్షల గురించి హెచ్చరిక.
ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు జంప్ చేస్తే జరిగే ప్రమాదాలు.
ప్రతీ వాహనదారుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని సూచనలు.
"సాంకేతికతను ఉపయోగించుకుని ప్రజలకు చేరువవ్వడమే మా లక్ష్యం. నెహ్రూ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన ఈ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా నిరంతరం ట్రాఫిక్ నిబంధనలను ప్రదర్శించడం జరుగుతుంది. వాహనదారులు పోలీసులకు సహకరించి, చట్టాలను గౌరవించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు."
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది మరియు వాహనదారులు పాల్గొన్నారు.
