విశ్వవిఖ్యాత నందమూరి తారక రామరావు గారికి ఘన నివాళులు.



 విశ్వవిఖ్యాత నందమూరి తారక రామరావు గారికి ఘన నివాళులు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

      ప్రకాశం విశ్వవిఖ్యాత,నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కొండేపి నియోజకవర్గ తూర్పునాయుడుపాలెం లో ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు నివాళులర్పించిన మంత్రి డిఎస్ బీవీ స్వామి, మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య.

    ఎన్టీఆర్ అనేది మూడక్షరాల పేరు కాదు అది తెలుగుజాతి ఆత్మ గౌరవ ప్రతీక.తెలుగు జాతి శక్తిని దశ దిశలా చాటి చెప్పిన మహనీయులు ఎన్టీఆర్. సంక్షేమానికి ఆద్యుడు అన్న ఎన్టీఆర్. విప్లవాత్మకమైన సంక్షేమ, అభివృద్ధి పధకాలు తీసుకొచ్చి పేదల గతిని మార్చిన మహనీయుడు ఎన్టీఆర్.

       పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాలు, ఆస్తిలో మహిళలకు సమాన వాటా వంటి విప్లవాత్మక నిర్ణయాలతో ఎన్టీఆర్ పాలనలో తనదైన ముద్ర వేశారు. ఎన్టీఆర్ సినీ రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్న ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. తెలుగు ప్రజల గుండెల్లో దేవుడిలా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగుజాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ కీర్తి అజరామరంగా వెలుగుతూనే ఉంటుంది.ఎన్టీఆర్ ఆశయాలగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పాలన సాగిస్తున్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఈ సందర్భంగా తెలియజేశారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post