అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుక.
ఏలూరు క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
కూటమి ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం.... జిల్లా ముఖ్య కేంద్రాలు ప్రజలకు చేరువుగా ఉండేందుకు..చేపట్టిన జిల్లాల పునర్విభజనను స్వాగతిస్తూ..
సీఎం నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అభినందనలు తెలుపుతున్నట్లు.. అదే క్రమంలో ఏపీ పునర్విభజన చట్ట ప్రకారం అసెంబ్లీ సీట్లు పెంపునకు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నట్లు అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పొలిమేర హరికృష్ణ చెప్పారు. అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుక ఏలూరు లోని ఒక ప్రైవేట్ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ... ఏపీ పునర్విభజన చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రాలలో ప్రతి పార్లమెంటు స్థానానికి రెండు అసెంబ్లీ సీట్లు చొప్పున, ఏపీలో 50, తెలంగాణలో 34 సీట్లు పెరగాల్సి ఉందన్నారు, నాటి ఎన్నికల ప్రధాన అధికారిబన్వర్లాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడo కూడా జరిగిందని, కానీ వివిధ కారణాల వలన జరగకపోవడం దురదృష్టకరమన్నారు. దేశవ్యాప్తంగా జరిగే నియోజవర్గాల పునర్విభజన తో సంబంధం లేదని, ఏపీ చట్టంలో పేర్కొనబడిన విధంగా తెలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ సీట్లు పెంచాల్సి ఉందని, ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏపీ జనాభా 4కోట్ల, 93 లక్షల, 78 వేల 776 అయితే, పెరిగే అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 225 తో భాగిస్తే, ప్రతి నియోజకవర్గానికి 2, 19,461 జనాభా కలిగి ఉంటారని, ఇది విభజన చట్టంలో పేర్కొనబడిందని తెలిపారు. పునర్విభజన వలన sc,st సీట్లు మొత్తంగా 50 సీట్లకు చేరుతాయని, పునర్విభజన వలన ప్రస్తుత ఉన్న నియోజకవర్గాల భౌగోళిక స్వరూపలు మారి, నూతనమైన అసెంబ్లీ స్థానాలు ఏర్పడడంతో తెలుగు ప్రజలు ఎంతో సంతోషిస్తారన్నారు.
12 సంవత్సరాలుగా అసెంబ్లీ సీట్లు,పెంచకపోవడం బాధాకరమని అన్నారు.ఏపీ విభజన చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రాలలో ఏర్పడిన ఎమ్మెల్సీ స్థానాలను ఈ రాష్ట్రాలలో ఉన్న రాజకీయ పార్టీలు సద్విని చేసుకున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు,2029 లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి ఏపీలో 225, తెలంగాణలో 153 సీట్లకు ఎన్నికలు జరిపించాలని హరికృష్ణ, సమితి నాయకులు డిమాండ్ చేశారు. అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి 10వ వేడుకలు హైదరాబాద్, వైజాగ్, ఏలూరులో నిర్వహించినట్లు చెప్పారు.
తొలుత కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ దళిత నాయకులు పలివెల చంటి, సమితి నాయకులు ఉండి నాగేశ్వరరావు పెనమలూరు రామారావు ఉప్పులూరి యువరాజ, దేవదాసు, బెంజిమెన్ పలువురు నాయకులు పాల్గొన్నారు.


