నూతన ఎలక్ట్రికల్ చెత్త సేకరణ ఆటోను ప్రారంభించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి.



 నూతన ఎలక్ట్రికల్ చెత్త సేకరణ ఆటోను ప్రారంభించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి. 

క్రైమ్ 9 మీడియా గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి బి అమృత్ రాజ్.

 మార్కాపురం జిల్లా కంభం పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా, ప్రభుత్వం నుంచి మంజూరైన నూతన ఎలక్ట్రికల్ చెత్త సేకరణ ఆటోను గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మంగళవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా ప్రారంభించారు. ​రిబ్బన్ కట్ చేసి వాహనాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ​పరిశుభ్రతే లక్ష్యంగా గ్రామ పంచాయతీలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన పేర్కొన్నారు. ​పర్యావరణ హితం, కాలుష్య రహిత పారిశుద్ధ్య సేవల కోసం ఎలక్ట్రికల్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, వీటి ద్వారా ఖర్చు తగ్గడమే కాకుండా పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించే ప్రక్రియలో ప్రజలు సహకరించాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

        ఈ కార్యక్రమంలో కంభం ఎంపీడీఓ వీరబద్రాచారి, డిప్యూటీ ఎంపీడీఓలు, విజయలక్ష్మి, బ్రహ్మయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ పూనూరు భూపాల్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు కొత్తపల్లె శ్రీను, సొసైటీ బ్యాంకు చైర్మన్ కేతం శ్రీను, రాష్ట్ర ఎడ్యుకేషన్ & సోషల్ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గోనా చెన్నకేశవులు, రాష్ట్ర సగర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరెపల్లి మల్లికార్జున, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తోట శ్రీను, పట్టణ అధ్యక్షులు ఓబుల్ రెడ్డి మాధవ్, పంచాయతీ సెక్రెటరీలు, మరియు పంచాయతీ అధికారులు, కూటమి నాయకులు మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post