ఇకపై ఎయిడెడ్ లెక్కలు నిక్కచ్చిగా ఉండాలి.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం మండల కేంద్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు లెక్కలను నిక్కచ్చిగా నిగ్గుతేల్చనున్నట్లు ఎంఈవోలు అబ్దుల్ సత్తార్, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసులు చెప్పారు.
శనివారం మండలంలోని పలు ఎయిడెడ్ పాఠశాలలను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థుల హాజరునుభౌతికంగా,ఆన్లైన్,రికార్డు నమోదులో వ్యత్యాసాలను గుర్తించి వాస్తవ నివేదికలను రూపొందించారు.
హాజరు లెక్కల్లో తేడా ఉన్న పాఠశాలలు తక్షణమే సరిచేయాలని , లేనిచో చర్యలు తప్పువని హెచ్చరించారు.
నివేదికలను ఉన్నతాధికారులకు చేరవేస్తున్నట్లు తెలిపారు.

