అంగన్వాడీల జీతాలను పిఆర్సికి లింక్ చేయాలి - అంగన్వాడిల సంఘాల డిమాండ్.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ.
ఏలూరు,డిసెంబర్, 12:రాష్ట్రంలో అంగన్వాడీల జీతాలను పిఆర్సికి లింకు చేయాలని, గుజరాత్ హైకోర్టు తీర్పును అమలు చేయాలని, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లను మార్చాలని, పని భారాలు తగ్గించాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరుతూ నేడు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు 3 సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాని ఉద్దేశించి ఏ.పి. ప్రగతిశీల అంగన్వాడి వర్కర్స్@హెల్పర్స్ యూనియన్(IFTU) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బి.శిరోమణి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొమరం మారమ్మ, జిల్లా కన్వీనర్ కే. విజయలక్ష్మి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీల జీతాలు అద్వానంగా ఉండడానికి ప్రధాన కారణం పి.ఆర్.సి తో లింక్ చేయకపోవడమేనని అన్నారు. ప్రక్క రాష్ట్రం తెలంగాణలో అంగన్వాడీల జీతాలు పిఆర్సికి లింక్ చేసుకున్నారని,అందువల్లనే వారు మన రాష్ట్రంలో కంటే అధిక వేతనాలు పొందుతున్నారని, అలాగే రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు పిఆర్సికి లింక్ చేసుకోవడం వల్లనే 21 వేల వేతనం పొందుతున్నారని, కానీ మన రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు 11,500 హెల్పర్లు 7,000 మాత్రమే వేతనాలు పొందుతున్నారని, చాలీచాలని జీతాలతో అంగన్వాడి వర్కర్లు బ్రతకలేని పరిస్థితులు ఉన్నారని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల జీతాలను పిఆర్సికి లింకు చేసి పెంచాలని వారు డిమాండ్ చేశారు. పనిభారాలు, యాప్ ల ఒత్తిడి, ఎఫ్ ఆర్ ఎస్ లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మీనీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా మార్చాలని కోరారు. ఇంకా ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐ.ఎఫ్.టి. యు జిల్లా అధ్యక్షులు కె.వి. రమణ, ప్రధాన కార్యదర్శి బద్దా వెంకటరావు, ఏలూరు నగర అధ్యక్ష, కార్యదర్శులు బి. సోమయ్య, యర్రా శ్రీనివాసరావులు మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి కొణతల రామలక్ష్మి, ఆకాష్, కె.విజయదుర్గ,బి. బేబీ, శంకరమ్మ ,కెచ్చల పద్మ,జి.లలిత, పి.వెంకాయమ్మ, చింతల గంగమ్మ, కె. గంగాదేవి, జి.నాగలక్ష్మి, చంద్రమ్మ, నిర్మల, ఆంతోనమ్మ తదితరులు నాయకత్వం వహించారు.అంగన్వాడీల ఆందోళనకు ఐ.ఎఫ్.టి.యు నగర నాయకులు రత్నబాబు, పద్మ, సింహాచలం, కుమారి, రాములమ్మ, గంగమ్మ, మీసాల రమణ, అప్పారావు, విజయ్, సూరిబాబు తదితరులు మద్దతు తెలిపారు. అంగన్వాడీలు తమ జీతాలను పిఆర్సికి లింకు చేయాలని, గుజరాత్ హైకోర్టు తీర్పును రాష్ట్రంలో అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, పనిభారాలను తగ్గించాలని, అంగన్వాడీల ఐక్యత వర్ధిల్లాలి అని పెద్ద ఎత్తున నినాదించారు.

