జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో యువకుడు మృతి.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు.అనకాపల్లి డిసెంబర్:12
అనకాపల్లి జిల్లాలో ఎలమంచిలి మండలంలో రేగుపాలెం జాతీయ రహదారి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మడుగుల నాగు(36) అనే యువకుడు మృతి చెందారు. ఈ ఘటనపై రూరల్ ఎస్సై ఉపేంద్ర తెలిపిన వివరాల మేరకు నక్కపల్లి మండలం నెల్లిపూడి గ్రామానికి చెందిన మడుగల నాగు అత్తయ్య గ్రామమైన యలమంచిలికి వచ్చి తిరుగు ప్రయాణంలో రేగుపాలెం జాతీయ రహదారికి చేరుకునేటప్పటికి సుమారు ఉదయం 10:15 సమయంలో అనకాపల్లి నుంచి తుని వైపు వెళ్తున్న టిఎస్ 08యుబి 2748 అను నెంబర్ గల లారీ వేగంగా నడుపుతూ ముందు నాగు ప్రయాణిస్తున్న పల్సర్ బైక్ ను వెనుక నుంచి ఢీకొట్టగా బైక్ నుంచి పడిపోగా, లారీ టైరు అతని తల,పొట్ట భాగం మీదుగా వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు ఎస్ ఐ తెలిపారు.ఈ ప్రమాదంపై నాగు భార్య దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.
