ఉపాధి కేంద్రంగా ఏలూరును తీర్చి దిద్దాలి ఐ.ఎఫ్.టి.యు. నాయకుల డిమాండ్.

ఉపాధి కేంద్రంగా ఏలూరును తీర్చి దిద్దాలి ఐ.ఎఫ్.టి.యు. నాయకుల డిమాండ్.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.

       జూట్ మిల్లుల స్థాయిలో వేలాదిమందికి ఉపాధి కల్పించే భారీ పరిశ్రమలను ఏలూరులో నెలకొల్పాలని, ముఠా, హమాలీ కార్మికులకు ఉపాధి, భద్రతతో కూడిన నూతన సమగ్ర సంక్షేమ చట్టం చేయాలని, 12వ పి.ఆర్.సి ని ప్రకటించి, ఆప్కాస్ కార్మికులనందరిని పర్మినెంట్ చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, చిరు వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్న బడా షాపింగ్ మాల్స్, మార్టు లను నిరోధించాలనే పలు తీర్మానాలను ఐ.ఎఫ్ టి యు ఏలూరు నగర నిర్మాణ జనరల్ బాడీ సమావేశం నేడు ఆమోదించింది. ఐ.ఎఫ్ టి యు ఏలూరు నగర నిర్మాణ జనరల్ బాడీ సమావేశం కామ్రేడ్ యర్రా శ్రీనివాసరావు అధ్యక్షతన స్థానిక మర్చంట్ చాంబర్ కళ్యాణమండపం నందు నేడు జరిగింది. ఈ సమావేశంలో ఐ.ఎఫ్ టి యు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు(యు.వి) ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గం, శ్రామిక ప్రజానీకంపై పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నాయని, కార్పొరేట్ అనుకూల విధానాలను ముందుకు తీసుకెళ్లేందుకు కార్మిక వర్గం వందల సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న చట్టాలను, హక్కులను కాలరాస్తున్నాయని అన్నారు. దానిలో భాగంగానే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకురావడం, పని గంటలను 8నుండి 10,12 గంటలకు పెంచడం వగైరా పెట్టుబడిదారీ, కార్పొరేట్ అనుకూల విధానాల అమలు అని తెలిపారు. మరోవైపు నిరుద్యోగ సమస్య పెరుగుతున్నా,కార్మిక చట్టాలు, కనీస వేతనాలు అమలు చేయకపోయినా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. కార్మిక వ్యతిరేక, ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జిల్లా ముఖ్య పట్టణం, ఏలూరు కార్పొరేషన్ పరిసర ప్రాంతాల్లో కార్మిక వర్గం మరింత సంఘటితమై రానున్న కాలంలో పెద్ద ఎత్తున కార్మిక పోరాటాలను విస్తరించాలని కోరారు. ఇంకా ఈ సమావేశంలో ఐ ఎఫ్ టి యు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కె.వి రమణ పాల్గొని మాట్లాడుతూ ఏలూరు నగరంలో సాధారణ చుట్టల కార్మికుల స్థాయి నుండి ఈరోజు అతిపెద్ద కార్మిక సంఘంగా ఐ.ఎఫ్ టి యు అవతరించిందని, దీని వెనక అనేక మంది నాయకుల కృషి, త్యాగాలు ఉన్నాయని, కామ్రేడ్ ధర్మన్న,నెక్కలపూడి రామారావు, ప్రసాదు, పోలారి, రెడ్డి అప్పలనాయుడు లాంటి వారి కృషి, పట్టుదలతో ఐ.ఎఫ్ టి యు అంచెలంచలుగా అనేక రంగాల్లోకి విస్తరించిందని తెలిపారు. కామ్రేడ్ సోమయ్య గారి నాయకత్వంలో అనేక సంఘాలు, వందలాది మంది కార్మికులు ఐ ఎఫ్ టి యు లో చేరడంతో మరింత బలపడిందని తెలిపారు. రానున్న కాలంలో ఏలూరు నగరం, పరిసర ప్రాంతాల్లో ఐ.ఎఫ్ టి యు మరింత బలపడేందుకు నూతన నాయకత్వం కృషి చేయాలని ఆయన అభిలాషించారు. ఇంకా నగర నిర్మాణ జనరల్ బాడీ సమావేశం ప్రజలపై భారాలు మోపే విద్యుత్ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించాలని, వివిధ సంస్థల్లో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనాలు,కార్మిక చట్టాలు అమలు చేయాలని, షాపులు,షాపింగ్ మాల్స్ లలో పనిచేసే ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని, మున్సిపల్ స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లను వెట్టిచాకిరి నుండి విముక్తి చేసి కనీస వేతనాలు అమలు చేయాలని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, పని గంటలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన జీవోను ఉపసంహరించుకోవాలనే తీర్మానాలను నగర నిర్మాణ జనరల్ బాడీ సమావేశం ఆమోదించింది. ఇంకా ఈ సమావేశంలో ఐ.ఎఫ్ టి యు రాష్ట్ర కమిటీ సభ్యుడు, సీనియర్ నాయకులు కామ్రేడ్ బి.సోమయ్య పాల్గొని మాట్లాడారు. అనంతరం ఈ క్రింది వారితో ఏలూరు నగర ఐ ఎఫ్ టి యు నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులు:-- కాకర్ల అప్పారావు, అధ్యక్షులు:- బి.సోమయ్య, ప్రధాన కార్యదర్శి:-- యర్రా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు:-- డి.వీరి నాయుడు, జి.రాంబాబు, లావేటి కృష్ణారావు, లింగమల్లు శ్రీనివాసరావు, కె.విజయలక్ష్మి, సహాయ కార్యదర్శులు:-- మంగం అప్పారావు, నౌడు నెహ్రూబాబు, జి.వెంకటేశ్వర రావు@ బాలు, డి.రత్నబాబు, ఎల్. సత్యనారాయణ, కోశాధికారి:-- పల్లి గంగరాజు లు ఆఫీసు బేరర్లు గాను మరో 46 మందితో కూడిన నూతన కమిటీని ఎన్నుకున్నారు. 


 

Post a Comment

Previous Post Next Post