రూ.63,080/- నగదు, 104 కార్డులు స్వాధీనం.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు.అనకాపల్లి డిసెంబర్:01
అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు చోడవరం పోలీస్ బృందం అక్రమ కార్యకలాపాలపై దాడులు మరింత వేగవంతం చేసింది.ఈ క్రమంలో, విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఆదివారం సాయంత్రం చోడవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డూరు గ్రామం మజ్జి గౌరమ్మ దేవాలయం పిక్నిక్ స్పాట్ వద్ద ఎస్సై బి.జోగారావు నేతృత్వంలోని పోలీస్ బృందం ప్రత్యేక దాడి చేపట్టింది.దాడి సమయంలో అక్రమంగా జూదం ఆడుతున్న 8 మంది నిందితులను పట్టుకొని, వారి నుంచి: రూ. 63,080/- నగదు,104 కార్డులు, స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగుతున్నట్లు చోడవరం పోలీసులు తెలిపారు.
అక్రమ జూదం, బెట్టింగ్, మాదకద్రవ్యాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిరంతరంగా ప్రత్యేక చర్యలు కొనసాగుతాయని, ప్రజలు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని జిల్లా పోలీసులు సూచించారు.
