ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ పి.రాజాబాబు.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఒంగోలు,నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ వాయుగుండం కారణంగా ఈ రోజు, డిసెంబర్ 1వ తేదీన జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు.
భారీ వర్షాల దృష్ట్యా ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. 24 గంటలు కంట్రోల్ రూమ్ నెంబర్ 08592-281400 ను ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తక్షణమే సంప్రదించవచ్చన్నారు. జిల్లా అత్యవసర ఆపరేషన్ కేంద్రం టోల్-ఫ్రీ నంబర్ 1077 ను సంప్రదించవచ్చన్నారు. ఈ కంట్రోల్ రూము నందు సంభందిత శాఖల సిబ్బంది పనిచేసేలా విధులు కేటాయించినట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఆర్డిఓ కార్యాలయాల్లో, మండల తహశీల్దార్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
