ఏలూరు హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు ఆధ్వర్యంలో మెగా రక్త ధాన కార్యక్రమం.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు జిల్లా.డిసెంబర్. 05.
ఏలూరు స్థానిక ఆర్ఆర్ పేట లోని గల హెచ్ డి ఎఫ్ సి బ్యాంకులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ డి ఎఫ్ సి అన్ని బ్రాంచ్ల సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు.
రక్తదానం చేసిన సిబ్బందిని క్లస్టర్ మేనేజర్ కళ్యాణ్ గారు అభినందనలు తెలియజేశారు. ఇటువంటి సేవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దావు గోపాల్ మరియు డాక్టర్ ఏ వి ఆర్ మోహన్ పాల్గొన్నారు.
అనంతరం క్లస్టర్ మేనేజర్ కళ్యాణ్ మాట్లాడుతూ గత 17 సంవత్సరాల నుంచి డిసెంబర్ ఐదో తారీఖున హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిబ్బంది ద్వారా రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని దీని ద్వారా మా వంతు సహాయం ప్రజలకు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు బ్యాంకు సిబ్బంది మరియు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.

