ఫార్మా ఇండస్ట్రీలో ప్రమాదాల నివారణకు ఎస్పీ తుహిన్ సిన్హా కొత్త అడుగు.
పరవాడ లోని మాన్ కైండ్ ఫార్మా కంపెనీలో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సందర్శన.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్)
పి. మహేశ్వరరావు.
అనకాపల్లి(పరవాడ) డిసెంబర్:04 పరవాడలోమాన్ కైండ్ ఫార్మా కంపెనీ ఆహ్వానం మేరకు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ , పరవాడ సబ్‌డివిజన్ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్తో కలిసి సంస్థను సందర్శించారు. కంపెనీ కార్పొరేట్ అధికారులు హానీ రిజ్వవి, గౌరవ్ సింగ్, హెచ్‌ఆర్ మేనేజర్ నరేష్ ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం సంస్థలో అమలవుతున్న భద్రతా విధానాలు, SOPలు, స్క్రబ్బర్ వ్యవస్థలు, ప్రమాదకర పదార్థాల నిర్వహణ, అత్యవసర ప్రతిస్పందన ప్రోటోకాల్‌లపై వివరణాత్మక ప్రజెంటేషన్ అందించారు.
ఫార్మా పరిశ్రమల్లో భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రతి ఉద్యోగి SOP(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) లను కచ్చితంగా అనుసరించడం, ప్రమాదకర రసాయనాల సురక్షిత నిర్వహణ, భద్రతా పరికరాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచడం, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన, మాక్ డ్రిల్స్‌ను క్రమం తప్పకుండా నిర్వహించడం వంటి అంశాలు ప్రమాదాల నివారణలో కీలకమని చెప్పారు. పరిశ్రమలో హౌస్‌కీపింగ్, వ్యర్థ పదార్థాల శుభ్రపరిచే విధానాలు కూడా సమర్థవంతంగా అమలవ్వాలని సూచించారు.అదనంగా, ఉద్యోగులు సైబర్ మోసాలపట్ల జాగ్రత్త వహించాలని, మరియు వాహనాలను నడుపుతున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ చిన్న సూచనగా తెలిపారు.ఈ కార్యక్రమంలో మాన్ కైండ్ ఫార్మా కంపెనీ అధికారులు, పరవాడ సీఐ మల్లికార్జునరావు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. పర్యటన సందర్భంగా ఎస్పీ గారు స్మారకంగా ఒక మొక్కను నాటారు.

