హలో యువత మేలుకో – చెడు వ్యసనాల నుండి నిన్ను నువ్వు కాపాడుకో”- AIYF.

హలో యువత మేలుకో – చెడు వ్యసనాల నుండి నిన్ను నువ్వు కాపాడుకో”- AIYF.
 యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.

AIYF హలో యువత మేలుకో యువత పోస్టర్ విడుదల చేసిన ఏలూరు రేంజ్ ఐజి జి.వి.యస్. అశోక్ కుమార్.

ఏలూరు క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.

యువతను చెడు వ్యసనాల బారిన పడకుండా కాపాడేందుకు, రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టిన ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి రూపొందించిన “హలో యువత మేలుకో – చెడు వ్యసనాల నుండి నిన్ను నువ్వు కాపాడుకో” అనే వాల్‌పోస్టర్‌ను ఏలూరు రేంజ్ ఐజీ జీ.వి.జీ. అశోక్ కుమార్ IPS  గురువారం ఏలూరు క్యాంపు కార్యాలయం లోఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ..

“ప్రతి రోజు పోలీసులు పట్టుకునే కేసుల్లో చాలా శాతం యువత వ్యసనాలకు సంబంధించినవే. డ్రగ్స్, గంజాయి, గుట్కా, మద్యం వంటి వాటి వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు—విద్య, ఉద్యోగ భవిష్యత్తు, కుటుంబ ఆనందం, సమాజ శాంతి అన్నీ శాశ్వతంగా దెబ్బతింటాయి. అవగాహనే మార్గం. AIYF లాంటి యువజన సంఘాలు ముందుకు రావడం అభినందనీయం అని “యువతను తప్పుదోవ పట్టించే మాఫియాలు, వ్యాపారులు, అక్రమ దందాలు పెరుగుతున్నాయి. ప్రతీ విద్యార్థి, ప్రతీ యువకుడు కుటుంబం – విద్యాసంస్థ – సమాజం కలిసి పని చేస్తే వ్యసనాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయొచ్చు.” అని పేర్కొన్నారు.

ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్ర మాట్లాడుతూ,
“రాష్ట్రవ్యాప్తంగా యువతలో చెతన్యంకోసం,ప్రతి కాలేజీ, ప్రతి గ్రామం, ప్రతి నగరంలో అవగాహన సమావేశాలు, వాల్ పోస్టర్లు, ర్యాలీలు, సెమినార్లు నిర్వహిస్తాం.” అని అన్నారు.
“వ్యసనాల వ్యాపారానికి రాజకీయ సంరక్షణ లభించకూడదు. సమాజం జాగ్రత్తగా నిలబడితేనే యువత భవిష్యత్తు సురక్షితం.” అని,“వ్యసనం ఒక వ్యక్తి సమస్య కాదు; అది కుటుంబం, సమాజం మొత్తాన్ని ప్రభావితం చేసే ప్రమాదం. ఆటలు, క్రీడలు, పుస్తకాలు, కళలు, సేవా కార్యక్రమాలు వంటి పాజిటివ్ మార్గాల్లో యువతను నడిపించేందుకు మా ప్రచారం కొనసాగుతుంది.” అని.యువతను ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన దిశగా నడిపేందుకు యువత పిలుపునిచ్చారు.

  ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య,ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లంక గోవిందరాజులు, జిల్లా కార్యదర్శి తోర్లపాటి రాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు శివకుమార్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post