జి జి హెచ్ ని ఆకస్మిక తనికీ నిర్వహించిన కలెక్టర్.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలు జి జి హెచ్ లో పేషంట్ల మౌలిక సదుపాయాలు, మరియు ఇతర అవసరాలను గుర్తించి 5 నుంచి పది కోట్ల రూపాయల విలువైన పనులు త్వరలో ప్రారంభిస్తామని, శానిటేషన్ మెరుగు పడాల్సిన అవసరాన్ని గుర్తించామని జిల్లా కలెక్టర్. పి.రాజాబాబు అన్నారు. జి జి హెచ్ లో పేషంట్ల కు అందుతున్న మౌలిక వసతులు, పారిశుధ్య పరిస్థితుల స్వయంగా పరిశీలించారు. జి జి హెచ్ లో డ్రైన్, మరియు ఇతర సౌకర్యాలను ప్రాంగణం మొత్తం తిరిగి పరిశీలించారు. డ్రైనేజీ లో పేరుకుపోయిన చెత్తను వారంలో తొలగించాలని, పూర్తి స్థాయిలో పారిశుధ్యం మెరుగు పడాలని, లేదంటే ఏజెన్సీ పై చర్యలు తీసుకుంటాం అన్నారు. జి జి హెచ్ లో పరిస్థితుల పై అధ్యయనం చేసేందుకు జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా వైద్య అధికారి, ఏపీఎంఎస్ ఐడిసీ మెడికల్ సూపరెంటెండెంట్ ల తో కమిటీ వేశామని, ఆ కమిటీ ఇచ్చిన నివేదిక అంశాలను పరిశీలించేందుకు జి జి హెచ్ కు వచ్చామన్నారు. పేషంట్లు, వారి సహాయకులు సేద తీరేందుకు షెడ్డులు నిర్మించాల్సిన అవసరం ఉందన్న కలెక్టర్ పలు ప్రాంతాలను పరిశీలించారు. పాత కోవిద్ షెడ్ తో పాటు, ఎమర్జెన్సీ సమీపంలోనూ, మరియు నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ సమీపంలో విశ్రాంతి షెడ్డుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలని ఏపీఎంఎస్ ఐడీసీ అధికారులను ఆదేశించారు. అదే విధంగా మార్చురీ వద్ద వేచి వుండే వారి కోసం కూడా షెడ్ ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని, అన్ని షాప్స్ ఒకే చోట వుండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నిరుపయోగంగా వున్న ప్రదేశాలను గుర్తించి షాప్స్ ఏర్పాటు చేయాలన్నారు.
స్పేస్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని, పార్కింగ్, గ్రీనరీ, ఇతర అవసరాలను దృష్టిలో
ఉంచుకొని ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. వీటి సమగ్ర ప్రణాళిక కోసం కన్సల్టెన్సీ సేవలు వినియోగించుకుంటామన్నారు. జిల్లా జి జి హెచ్ లో మంచి వైద్య సేవలు అందుతున్నందున అధికంగా పేషంట్లు వస్తున్నారని, వారిని దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాలన్నారు. ఓ పి కౌంటర్లు అన్ని ఒకే చోట ఉంటే బాగుంటుంది అన్న అభిప్రాయం వ్యక్తం చేసిన కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రులు అని నిర్లిప్తత రాకుండా కార్పొరేట్ తరహా సేవలు అందించాలని, ఆ మేరకు డిజైన్ ఉండాలన్నారు. డంప్ తరలింపు విషయం లో కార్పొరేషన్ మరియు ఏజెన్సీ మధ్య సమన్వయము ఉండాలని, ఈ మేరకు సూపరెంటెండెంట్ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా రెవిన్యూ అధికారి ఓబులేసు, జి జి హెచ్ సూపరెంటెండెంట్ డా.మాణిక్య రావు, జిల్లా వైద్య అధికారి, డా.వెంకటేశ్వర్లు, కళాశాల ప్రిన్సిపాల్ డా.అశోక్ కుమార్ , ఏపీఎంసీడీసీ ఈఈ నిర్మల్ కుమార్, సి ఎస్ ఆర్ ఎమ్ .ఓ డా. మాధవీలత, ఎ.డి. అనిల్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్లు డా.తిరుపతి రెడ్డి, డా.ప్రభాకర్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరి, కార్పొరేషన్ హెల్త్ ఇన్స్పెక్టర్ , తదితరులు పాల్గొన్నారు,


