సందిగ్ధంలో....అక్రిడేషన్ ప్రక్రియ.
అమరావతి: జర్నలిస్టుల అక్రిడేషన్ ప్రక్రియ మరోసారి అనిశ్చితిలోకి వెళ్లింది. ఇప్పటికే సమాచార శాఖ తన కౌంటర్ దాఖలు చేసినప్పటికీ, లేబర్ కమిషనర్ వారం రోజులలో కౌంటర్ సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేడు, రేపో కొత్త అక్రిడేషన్ కమిటీలు వెలువడతాయని ఆశపడ్డ జర్నలిస్ట్ సంఘాలు, ఈ పరిణామాలతో కమిటీ ప్రక్రియ నిలిచిపోయే అవకాశాన్ని ఊహిస్తున్నాయి. ఇదిలా ఉండగా, అక్రిడేషన్ అంశంపై హైకోర్టులో మరో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో మొత్తం ప్రక్రియ ముందుకు సాగుతుందా లేదా నిలిచిపోతుందా అన్న అనుమానాలు మరోసారి తలెత్తాయి. ఇది రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల సమస్య కావడంతో సమగ్రంగా పరిశీలించిన తరువాతే తుది నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం వ్యాఖ్యానించటం పరిస్థితిని మరింత సందిగ్ధంగా మార్చింది....
