దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తులను అరెస్టు చేసిన గిద్దలూరు పోలీసులు.


 దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తులను అరెస్టు చేసిన గిద్దలూరు పోలీసులు.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

వివరాలకు వెళ్తే నిందితుల సంక్షిప్త మొదటి ముద్దాయి చెడు వ్యసనాలకు అలవాటు పడిన నేరస్తుడు చీరాల టౌన్ కు చెందిన వ్యక్తి కొంతకాలముగా ప్రకాశం జిల్లా గిద్దలూరు లో నివాసము ఉండి చెడు వ్యసనలకు మద్యానికి బానిస అయి పగలు పుట తాళాలు వేసిన ఇంటిని ఎంచుకొని రాత్రి సమయములో చిన్న ఇనుపరాడ్ తో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటిలోనికి వెళ్ళి బీరువా తెరచి అందులో ఉన్న బంగారు వస్తువులను దొంగిలించుకపోయి అమ్ముకొని జల్సాలు చేస్తుండేవాడు, ఆ క్రమములో గిద్దలూరు పోలీస్ స్టేషన్ పరిదిలో రాజనగర్, కొంగలవీడు, కృష్ణంశెట్టిపల్లి, గ్రామములొ ఇంటి దొంగతనాలు చేసి అతని పై సుమారు 50-60 కేసులు ఉన్నవి.

 అతను కొన్ని కేసులలో శిక్షలు చేసి మరికొన్ని కేసులలో బయట ఉన్నాడు. ఆ క్రమములో సుమారు 10 నెలల క్రితము కడప జిల్లా మైదుకూరు టౌన్ కు చెందిన సుంకర ఖాదర్ బాష అను అతనిని పరిచయము చేసుకొని తేదీ 23.11.2025 న కారులో మైదుకూరు నుండి గిద్దలూరుకు వస్తు గిద్దలూరు మండలము లోని దొద్దంపల్లి గ్రామ బస్ స్టాండ్ వెంట ఉన్న ఇంటికి తాళము వేసిన ఇంటిని ఎంచుకొని రాత్రి సమయములో ఆ ఇంటి తాళాలు పగల గొట్టి ఇంటిలోనికి వెళ్ళి బెడ్ రూమ్ లో ఉన్న బీరు తెరచి అందులో ఉన్న బంగారు వస్తువులను దొంగిలించి కారు లో పారిపోయి మరలా దొంగిలించిన బంగారు వస్తులను అమ్ముకొనుటకు కారులో మార్కాపురం వైపు వెళ్తూ ఇంటికి తాళాలు వేసిన ఇంటిని ఎంచుకొని గిద్దలూరు టౌన్ లోని అదర్శ బి ఈ డి కాలేజీ వద్ద కారు ఆపుకొని నిలుచోని ఉండగా, సీ ఐ ,కి రాబడిన సమాచారం మేరకు వారిని పట్టుకొని అరెస్టు చేసి వారి వద్దనుండి పైన కనబరిచిన వాటిని స్వాదినం చేసుకోవడమైనది.

ప్రకాశం జిల్లా ఎస్పీ , స్వీయ పరివేక్షణలో మరియు మార్కాపురం డి.ఎస్.పి వారి ఆద్వర్యం లో ముద్దాయిలను అరెస్ట్ చేసిన గిద్దలూరు అర్బన్ సీ ఐ కె సురేష్ ను మరియు సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ అభినందనలు తెలిపినారు.

Post a Comment

Previous Post Next Post