CCTNS అప్‌డేషన్‌లో నైపుణ్యం.
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మార్గదర్శకత్వంలో జిల్లా పోలీసులకు ప్రత్యేక శిక్షణ శిబిరం.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు.అనకాపల్లిపట్టణం, డిసెంబర్:03 జిల్లాలో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ & సిస్టమ్ (CCTNS) కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని అనకాపల్లి పట్టణం, రోటరీ క్లబ్ నందు ఏర్పాటు చేశారు.
ఈ శిబిరంలో రోజువారీగా CCTNS అప్‌డేట్స్‌ను సమయానికి నమోదు చేయడం, పెండింగ్ లేకుండా డేటాను పూర్తిగా అప్‌లోడ్ చేయడం, రికార్డుల ఖచ్చితత్వాన్ని కాపాడడం వంటి అంశాలపై లోతైన శిక్షణ అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతు
“పోలీసింగ్‌లో డిజిటలైజేషన్ చాలా కీలకం. సకాలంలో, ఖచ్చితంగా CCTNS అప్‌డేషన్ చేయడం మాత్రమే కాదు, ఇది కేసుల వేగవంతమైన అన్వేషణకు, నేరస్తుల గుర్తింపుకు, రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర డేటా సమన్వయానికి కూడా దోహదపడుతుంది. ప్రతి పోలీస్ స్టేషన్‌లో పెండింగ్ లేకుండా అన్ని వివరాలను అప్డేట్ చేయాలి” అని సూచించారు.
శిక్షణ శిబిరంలో CCTNS ఆపరేటర్లు, స్టేషన్ రైటర్లు, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ శిక్షణా శిబిరంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు, డి.సి.ఆర్.బి సిఐ ఎస్.లక్ష్మి మూర్తి, ఎస్సైలు ప్రసాద్, సురేష్ బాబు, శిరీష మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

