జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన నర్సీపట్నం టౌన్ ఇన్స్పెక్టర్ గఫూర్.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్(క్రైమ్).
పి. మహేశ్వరరావు.అనకాపల్లిజిల్లా, డిసెంబర్ :03
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాని నూతనంగా నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన గఫూర్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ , నర్సీపట్నం టౌన్ పరిధిలో శాంతి భద్రతలు, నేర నివారణ, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, ప్రజా సేవల మెరుగుదలకు అధిక ప్రాధాన్యంతో పనిచేయాలని సూచించారు. స్థానిక ప్రజలకు వేగవంతమైన పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్, రోడ్ సేఫ్టీ అమలులో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఇన్స్పెక్టర్ గఫూర్ , జిల్లాలో న్యాయ పరిరక్షణ, ప్రజా రక్షణ కోసం కృషి చేస్తానని ఎస్పీకి హామీ ఇచ్చారు.
