జిల్లా నేషనల్ హైవే భద్రతపై ఎస్పీ తుహిన్ సిన్హా సమీక్ష సమావేశం.
రోడ్ సేఫ్టీ రైట్ గేర్ ఎక్విప్మెంట్ అందించేందుకు చర్యలు వేగవంతం చేయాలని సూచించిన ఎస్పీ తుహిన్ సిన్హా.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్)
పి. మహేశ్వరరావు.అనకాపల్లి, డిసెంబర్ :03
అనకాపల్లి జిల్లా నేషనల్ హైవే పరిధిలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణను బలోపేతం చేయడానికి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ నేతృత్వంలో నేషనల్ హైవే అధికారులు, ఆర్ & బీ శాఖ మరియు జీవీఎంసీ అధికారులతో విస్తృత సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లాలోని నేషనల్ హైవేకు సంబంధించిన 11 పోలీస్ స్టేషన్లకు రోడ్ సేఫ్టీ రైట్ గేర్ ఎక్విప్మెంట్ అందించే అంశంపై సమగ్ర చర్చ జరిగింది. ట్రాఫిక్ భద్రతా ప్రమాణాలను పెంపొందించేందుకు అవసరమైన క్రింది కీలక సామగ్రిని త్వరితగతిన అందించేందుకు అధికారులు అంగీకరించారు:బ్లింకర్లు, ఇల్యూమినేషన్ లైట్స్, సోలార్ క్యాట్ఐస్, స్పీడ్ లిమిట్ సైన్ బోర్డులు, ANPR కెమెరాలు, సిగ్నల్ లైట్లు, లారీ బేస్ ఏర్పాటు తదితర విషయాలు.
ఎస్పీ మాట్లాడుతూ
“జిల్లాలో నేషనల్ హైవేలు అత్యంత రద్దీగా ఉండే మార్గాలు. ప్రమాదాలు తగ్గించేందుకు ఆధునిక భద్రతా పరికరాలు, కచ్చితమైన ట్రాఫిక్ మానిటరింగ్ వ్యవస్థ తప్పనిసరి. ఇవి అందుబాటులోకి రాగానే పోలీస్ స్టేషన్లు మరింత సమర్థవంతంగా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టగలవు” అని పేర్కొన్నారు.
నేషనల్ హైవే అధికారులు, ఆర్ & బీ ఇంజనీర్లు, జీవీఎంసీ అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో కలిసి పరికరాల స్థానిక అవసరాలు, ఇన్‌స్టాలేషన్ ప్రదేశాలు, తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
సమావేశంలో నేషనల్ హైవే విశాఖపట్నం, రాజమండ్రి, ఆర్&బి, జీవీఎంసీ చెందిన అధికారులు రిచర్డ్, ప్రమోద్ కుమార్, లక్ష్మణరావు, సత్తిరాజు, విజయేంద్ర, గోపాలకృష్ణ మరియు ఇన్స్పెక్టర్లు వెంకటనారాయణ, రమేష్, ఎస్సై విక్టోరియా రాణి పాల్గొన్నారు.
