పి. పి.పి విధానాన్ని రద్దు చేయాలి-ఏఐఎస్ఎఫ్.
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ 6400 కోట్ల రూపాయలు విడుదల చేయాలి.
ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి SC, ST, BC ప్రభుత్వ వసతి గృహాల సమస్యలను తక్షణమే అధికారులు పరిష్కరించాలి.
విద్యార్థులు సమస్యలు పరిష్కారం కోసం ఏలూరు జిల్లా అధికారులు దృష్టి పెట్టాలి- ఏఐఎస్ఎఫ్,
ఏలూరు.క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు : స్థానిక ఏలూరు ఆర్ఆర్ పేట లో ఉన్న స్ఫూర్తి భవన్ "సిపిఐ " కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్, ఏలూరు జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య గారు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ వాళ్లకి దారా దత్తం చేసేందుకు, పి.పి.పి అనే పేరుతో పేద మధ్య తరగతి విద్యార్థులు పొట్ట కొట్టేందుకు జీఓ. నెంబర్ 107, 108 ,తీసుకువచ్చి విద్యను దూరం చేస్తున్నారని, తక్షణమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ వాళ్లకు అమ్మేస్తే, ప్రజా సంఘాలను కలుపుకొని పోరాటానికి స్వికరం చూడతామని అన్నారు మరియు పేద విద్యార్థులు చదవాలంటే ఏలూరు జిల్లాలో ప్రభుత్వ వసతగృహాలు లేకపోవడంతో విద్యార్థులు విద్యను మధ్యలో ఆపేస్తున్నారని, తక్షణమే పేద విద్యార్థులకు ప్రభుత్వ వసతి గృహాలు ఏర్పరచాలని వారికి మూలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు.
ఏఐఎస్ఎఫ్, ఏలూరు జిల్లా అధ్యక్షులు డి. శివ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు 6400 కోట్లు రూపాయలు విడుదల చేయాలని, ఏలూరులో ఉన్న ప్రభుత్వ కోటదిబ్బ డిగ్రీ కళాశాలకు శాశ్వతమైన భవనాలు నిర్మించాలని, మరియు ఏలూరు జిల్లా అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తమ విద్యార్థుల సమస్యలు పరిష్కారంపై దృష్టి పెట్టాలని అన్నారు. ఒకవేళ జిల్లా అధికారులు ఏమాత్రం స్పందించకపోతే ఏఐఎస్ఎఫ్, ఉద్యమాలకు శ్రీకారం చుడతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఏలూరు నాయకులు, సిద్దు, సాయి,తాజ్, చరణ్, నాగచైతన్య, కిషోర్, నాగ సాయి, హేమంత్, పండు, మరియు ఏఐఎస్ఎఫ్, కుక్కునూరు మండలం నాయకులు శౌర్య, ఆదేశ్, రామ్ చరణ్, ఆనంద్, వరుణ్, మహేష్, దిలీప్, రాకేష్, నాయకులు పాల్గొన్నారు.
