నిర్మల్ జిల్లాలో దారుణం.. మంత్రాల నెపంతో హత్య!
తెలంగాణ డిసెంబర్ 13.
నిర్మల్ జిల్లాలో దారుణం.. మంత్రాల నెపంతో హత్య!
నిర్మల్ జిల్లా కడెం మండలం వుండుంపూర్ పంచాయితీ పరిధిలోని గండి గోపాల్పూర్ గ్రామంలో దేశినేని భీమయ్య (55) అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మంత్రాల నెపంతో కర్రలతో కొట్టి హత్య చేశారు. అనంతరం, ఆధారాలు దొరకకుండా ఉండేందుకు మృతుడిని కాల్చి బూడిద చేశారు. సంఘటన స్థలంలో మిగిలిన బూడిద, ఎముకలను చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు...
