హైపర్ కమిటీని వీలైనంత త్వరలో నియామకం చేస్తాం- రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.


 హైపర్ కమిటీని వీలైనంత త్వరలో నియామకం చేస్తాం- 

రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.

జర్నలిస్టులపై దాడుల నివారణకు వీలుగా రాష్ట్రస్థాయిలో హైపర్ కమిటీని వీలైనంత త్వరలో నియామకం చేస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతినిధి వర్గానికి హామీ ఇచ్చారు. సచివాలయంలో డిసెంబర్ 9వ తేదీ హోం మంత్రిని కలిసిన ఫెడరేషన్ ప్రతినిధి వర్గం జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నివారణకు రాష్ట్రస్థాయిలో హైపర్ కమిటీ, జిల్లా స్థాయిలో దాడుల నివారణ కమిటీలను నియమించాలని అందుకు వీలుగా ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని వాటిని తక్షణమే అమలు చేయాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ వెంటనే కమిటీ నియామకంపై తగిన చర్యలు తీసుకోవాలని ఓ ఎస్ డి అనిల్ కుమార్ కి ఆదేశం ఇచ్చారు. మంత్రిని కలిసిన ఫెడరేషన్ ప్రతినిధి వర్గంలో ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు తో పాటుగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కలిమి శ్రీ,, ఎంబీనాథన్, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు ఆనంద్, చిన్న పత్రికల సంఘం నాయకులు హుస్సేన్ ఖాన్ లు ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post