ఘనంగా అంతరాజాతీయ దివ్యంగులు దినోత్సవం.


ఘనంగా అంతరాజాతీయ దివ్యంగులు దినోత్సవం.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి.

విశాఖపట్నం డిసెంబర్:04.

       గోపాలపట్నం మండలం లక్ష్మీ నగర్ భవిత కేంద్రంలో ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి డి దివాకర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వము నుండి దివ్యాంగ పిల్లలకు వచ్చే పథకాలను, రాయితీలను, సౌకర్యాలను వివరించారు. ఈ పిల్లలలో గల నైపుణ్యాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించాలని, ఆయా రంగాలలో వారి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. దివ్యాంగ విద్యార్థులలో భవిష్యత్తుపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని కోరారు. ఈ భవిత సెంటర్లో నెలకి నెలలో నెలలో ఆరు రోజులు ఫిజియోథెరపీ జరుగుతుందని చెప్పారు. పిల్లలను క్రమము తప్పకుండా సెంటర్ కు తీసుకువచ్చి వారి చేత ఇక్కడ తర్ఫీదును పొందడానికి సహకరించాలని కోరారు కోరారు. ఈ పిల్లల కోసము నియమితులైన ఐ ఇ ఆర్ టి ల, మరియు ఆయా సేవలనుకొనియాడారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఇలాంటి పిల్లలకు సేవ చేసే భాగ్యము కలిగినందుకు అదృష్టముగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post