మార్కాపురం జిల్లా ఇన్చార్జి కలెక్టర్. ఇన్చార్జి ఎస్పి. మంత్రి డాక్టర్ డోల గారికి స్వాగతం పలికిన మార్కాపురం జిల్లా ప్రజలు.





 మార్కాపురం జిల్లా ఇన్చార్జి కలెక్టర్. ఇన్చార్జి ఎస్పి. మంత్రి డాక్టర్ డోల గారికి స్వాగతం పలికిన మార్కాపురం జిల్లా ప్రజలు. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రజలుమార్కాపురం జిల్లా ఇచ్చిన హామీకి కట్టుబడి అన్ని ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా. బాలవీరాంజనేయ స్వామి చెప్పారు. మార్కాపురం జిల్లా ఏర్పాటే దీనికి నిదర్శనమని అన్నారు.

నూతనంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో బుధవారం పట్టణ శివారులోని ఆర్ అండ్ ఆర్ కాలనీలోని భవనములో ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఇన్చార్జి కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. జిల్లా ఎస్పీ .వి.హర్షవర్ధన్ రాజు, మారీటైం బోర్డు చైర్మన్ .దామచర్ల సత్య, మార్కాపురం ఎమ్మెల్యే .కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే.ముత్తుమల అశోక్ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే.ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి.గూడూరి ఎరీక్షన్  బాబు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టరేట్ను ప్రారంభించడానికి వస్తున్న వీరికి స్థానిక ప్రజలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాలుస్తూ డప్పు వాయిద్యాలతో ఆహ్వానించారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా రాజాబాబు బాధ్యతలు స్వీకరించి ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

              ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ... ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. హామీ ఇచ్చిన మేరకు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశామని, అదేవిధంగా వెలుగొండను కూడా పూర్తిచేసి ఈ ప్రాంత ప్రజలకు తాగు, సాగు నీటిని అందిస్తామని స్పష్టం చేశారు. 

            కలెక్టర్ మాట్లాడుతూ నూతన జిల్లా ఏర్పడటం వలన అన్ని శాఖల ఉన్నతాధికారులతో పాటు ఎస్పీ, కలెక్టర్ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టుతో పాటు ఇప్పటికే ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు అడుగులు పడ్డాయి అన్నారు. రానున్న రోజుల్లో అభివృద్ధి చెందిన ప్రాంతంగా మార్కాపురం మారుతుంది అన్నారు. 

           ఎస్పీ మాట్లాడుతూ మార్కాపురం జిల్లా ఏర్పడటం వలన శాంతిభద్రతలపై మరింత దృష్టి పెట్టే అవకాశం లభించింది అన్నారు. మొట్టమొదటి ఎస్పీగా తాను ఉండే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. దామచర్ల సత్య మాట్లాడుతూ భౌగోళికంగా వేరుపడినప్పటికీ అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సమిష్టిగా ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. మార్కాపురం ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కాపురం జిల్లా కోసం 2 నెలలకు పైగా ఈ ప్రాంత ప్రజలు గతంలో పోరాడారని, అదే స్ఫూర్తితో జిల్లా అభివృద్ధి కోసం పాటుపడాలని కోరారు. మార్కా'పూర్' అని కాకుండా, అభివృద్ధి ప్రతిధ్వనించేలా ఇకనుంచి మార్కా'పురం' అని పిలుచుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లాను ' చంద్రన్న మార్కాపురం జిల్లా'గా పేరు మార్చేలా అందరూ మరోసారి కృషి చేయాలని ఆయన అన్నారు. అధికార యంత్రాంగానికి ప్రజలందరూ సహకరిస్తారని, అదేవిధంగా జిల్లా అభివృద్ధికి అధికారులు కూడా తమ వంతు పాత్ర పోషించాలని ఆయన కోరారు. 

వెలుగొండ ప్రాజెక్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అక్కడ తాను గుడి కట్టిస్తానని ప్రకటించారు. గిద్దలూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా పరిపాలన కేంద్రం అందుబాటులో ఉండటం వలన ప్రభుత్వ సేవలు, అభివృద్ధి వేగవంతమవుతాయి అన్నారు. కనిగిరి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధిపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. వివిధ ప్రాజెక్టులకు నిధులు కేటాయించేలా చూడడమే దీనికి నిదర్శనం అన్నారు. గూడూరి ఎరీక్షన్ బాబు మాట్లాడుతూ మార్కాపురం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి కూడా వలస కూలీలు ఎక్కువగా ఉంటున్నారని, నూతనంగా జిల్లా ఏర్పడటం వలన ఈ పరిస్థితిలో మార్పు వస్తుందన్నారు. 

            ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా డిఆర్ఓ బి.చిన ఓబులేసు, మార్కాపురం ఇన్చార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాస్, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఇమ్మడి కాశీనాథ్, పలు శాఖల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

         అనంతరం అధికారులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. నూతన జిల్లా అభివృద్ధి పథంలో నడిచేలా పనితీరుపై ఆయన దిశా నిర్దేశం చేశారు.

Post a Comment

Previous Post Next Post