క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు, డిసెంబర్ 31:- ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం దేశంలో ఒక పెనుమార్పు రావడానికి నిరంతరం అలుపెరగని పోరాటం చేస్తున్న, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి 2026 నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి వెన్నంటే ఉంటూ పార్టీని క్రమశిక్షణగా నడుపుతున్నటువంటి పౌరసరఫరాల మంత్రి వర్యులు, మా PAC చైర్మన్ శ్రీ నాదేండ్ల మనోహర్ గారికి, రాష్ట్ర కార్యవర్గానికి అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు (చినబాబు) గారికి జిల్లా కార్యవర్గానికి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఏలూరు నియోజకవర్గ ప్రజలకు 2026 నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి, విద్యార్థిని విద్యార్థులకు, శ్రామిక వర్గానికి, కార్మిక వర్గానికి, రైతు సోదరులకు, వ్యాపార వర్తక సోదరులకు, ఉద్యోగస్తులకు, ఎన్జీవో సంఘాలకు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అన్నారు.
ఈ 2026 సంవత్సరంలో అందరం కూడా ఆనందంగా, సంతోషంగా జీవించాలని, ఆంధ్ర రాష్ట్రం మరింత అభివృద్ధి జరగాలని, రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ కల్పన కానీ, మౌలిక వసతులు కానీ, ఇండస్ట్రీలు గాని అన్ని రంగాల్లోనూ ఈ డబల్ ఇంజన్ సర్కార్ ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి చెందిందని, మేమందరం ఆశిస్తున్నామన్నారు. రాష్ట్ర సంపతి అందరికీ అందే విధంగా ఉండాలని, రాష్ట్రం అప్పుల ఊబిలో నుంచి బయటకు రావాలి, యువతరానికి ఉపాధి కల్పించాలి, నూతన ఇండస్ట్రీ విధానాన్ని తీసుకురావాలి, మనమందరం కలసికట్టుగా అభివృద్ధి పథంలో నడవాలని, 2026లో మంచి పరిపాలన అందించే విధంగా ఆ పరమేశ్వరుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారికి, ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారికి, నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు గారికి, ఆర్టీసీ ఉన్నతాధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి, మంచి ఆశీస్సులు, ఆయురారోగ్యాలు అందించాలని కోరి ప్రార్థిస్తున్నామన్నారు.
