ఏలూరు ఆర్.ఆర్.పేట శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లో ఘనంగా జరుగుతున్న శ్రీవారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవం.




 ఏలూరు ఆర్.ఆర్.పేట శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లో ఘనంగా జరుగుతున్న శ్రీవారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవం.

ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన రెడ్డి అప్పల నాయుడు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

ఏలూరు, డిసెంబర్ 27:- శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా వర్థిల్లాలని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు ఆకాంక్షించారు. ఏలూరు ఆర్.ఆర్.పేటలో వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని శనివారం సందర్శించిన ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆయనకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం స్వామివారిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఆయన మాట్లాడుతూ భక్తులకు ఆరోగ్యాన్ని ప్రసాదించే శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిపై మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ వారి త్రిసప్తాహా బ్రహ్మోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీమతి పాలడుగు వెంకట రమాదేవి, ధర్మకర్తలు ఈతకోట శ్రీనివాస్ రావు, నంగులూరి సత్యనారాయణ, బొత్స మధు, గోకా నెహ్రూ బాబు, కందుకూరి వెంకట సీతారామాంజనేయ శర్మ, సువ్వాడ పద్మావతి, చౌటుపల్లి తులసి, డొక్కు రమాదేవి, గుమ్మడి లక్ష్మీ గణేశ్వరీ, రంభా అనసూయ, ఎక్స్ అఫిషియో సభ్యులు శ్రీమాన్ కిళాంబి మారుతి శ్రీనివాస్ రామానుజాచార్యులు జనసేన నాయకులు వినోద్, మరియు భారీ సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post