జిల్లాలో ప్రజలకు సురక్షితమైన త్రాగునీరుఅందించ డానికి చర్యలు తీసుకోవాలి.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలు మంగళవారం స్థానిక కలెక్టరేట్ నుండి జల సురక్ష, స్కబ్ టైఫస్ జ్వరాలు, ప్రధాన మంత్రి సూర్యఘర్, గృహనిర్మాణాలు, క్యాటిల్ షేడ్స్ నిర్మాణాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు త్రాగునీ సురక్షితమైన త్రాగునీరు అందించ డానికి జలసురక్ష మాసంగాఈ నెల రోజులు పాటు త్రాగునీటి పథకాలను పరిశుభ్రం చేయటం, పైప్ లైన్లు, త్రాగునీటి బోర్లు మరమ్మత్తులు చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని అధి కారులను ఆదేశించా మని ఆయన చెప్పారు.
జిల్లాలో 856 ఓవర్ హెడ్ ట్యాంకులు ఉంటే ఇప్పటికే 500 కు పైగా త్రాగునీటి ట్యాంకుల ను శుభ్రపరచడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. మిగతావి కూడా ఈ నెలచివరి లోగా శుభ్రం చేయాల ని అధికారులను ఆదేశించామన్నారు.
గ్రామాల్లో త్రాగునీటి ఓ. హెచ్.ఆర్ ట్యాంకు లను పరిశుభ్రం చేసే కార్యక్రమాలగురించి ప్రజలకు తెలియ జేయాలనిఆయనఅన్నారు
గ్రామాల్లో ప్రజలకు సురక్షితమైన త్రాగునీరుఅందిస్తు న్నామనే భరోసాను ప్రజలు కల్పించాలని అధికారులకు ఆయన చెప్పారు.
మండల స్థాయిలో అధికారులు వారంలో మూడు రోజులుపాటు గ్రామాల్లో పర్యటించా లని ఆయన చెప్పారు. మండలస్థాయి అధికారులు గ్రామాల్లో తిరిగి ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తెలుసు కొని పరిష్కరించే దిశగాపనిచేయాలని ఆయన చెప్పారు.
జిల్లాలో స్కబ్ టైపస్ జ్వరం గురించి ప్రజలు ఆందోళన చెందకుండా అవగాహన కల్పించా లని ఆయన అధికారు లను ఆదేశించారు.
జిల్లాలోనిఅన్ని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత వైద్య సేవలు, మందులు అందు బాటులోఉన్నాయని ప్రజలుఈఅవ కాశాన్ని వినియోగించుకోవాల ని ఆయన అన్నారు.
జిల్లాలో సూర్యగర్ పధకంక్రింద సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరు విని యోగించుకోవాలని ఆయన చెప్పారు.
జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం క్రిందమంజూరు చేసిన క్యాటిల్ షెడ్ల నిర్మాణా లు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ప్రభుత్వ మంజూరు చేసిన గృహ నిర్మాణా లను ఉగాది నాటికి పూర్తి చేయాలని ఆయన అధికారులకు చెప్పారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ జోసఫ్ కుమార్, ట్రాన్స్ కో ఎస్.ఇ వెంకటేశ్వర రావు, గ్రామీణ నీటిసరఫరాశాఖ ఎస్.ఇ బాల శంకర్రావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
