ముగ్గురు దొంగలు అరెస్ట్ - దొంగిలించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
నంద్యాల జిల్లా కొట్టాల గ్రామానికి చెందిన ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసిన కొమరోలు ఎస్సై నాగరాజు.
కొమరోలు మండలంతో సహా గిద్దలూరు, రాచర్ల, కంభం, పెద్దారవీడు పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ సామాగ్రిని దొంగిలించిన దొంగలు.
దొంగల నుండి , రాగి తీగ, స్తంభాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
కొమరోలు మండలంలోని నారాయణ పల్లె గ్రామం క్రాస్ రోడ్డు వద్ద 3,85,000 సామాగ్రిని స్వాధీనం చేసుకున్న కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగరాజు. సిబ్బంది.
చెడు అలవాట్లకు బానిసలై దొంగతనాలకు అలవాటు పడిన స్నేహితులు.ముగ్గురు దొంగలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జె రామకోటయ్య. తెలిపారు.
