పేకాట స్థావరాలపై బుచ్చయ్య పేట పోలీసుల దాడి.

పేకాట స్థావరాలపై బుచ్చయ్య పేట పోలీసుల దాడి.

8 మంది అరెస్ట్, రూ.3.660 నగదు, 52 కార్డులు స్వాధీనం.

అనకాపల్లి డిసెంబర్:02. బుచ్చయ్య పేట పోలీస్

స్టేషన్ పరిధిలో రాజాం గ్రామ సమీపంలో ఎస్సై శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీస్ బృందం సోమవారం జరిపిన ప్రత్యేక దాడుల్లో అక్రమంగా జూదం ఆడుతున్న 8 మంది నిందితులను పట్టుకున్నుట్లు పోలీసు లు తెలిపారు. ఈ దాడు ల్లో నిండితుల నుండి రూ 3.660/- నగదు, 52 కార్డులు, స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. అక్రమ జూదం, బెట్టింగ్, మాదకద్రవ్యాలు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిరంతరంగా ప్రత్యేక చర్యలు కొనసాగుతాయని, ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని, పోలీసులు సూచించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు మేరకు అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులు, శక్తులు పై నిఘా ఉంచినట్లు తెలియజేశారు.
 

Post a Comment

Previous Post Next Post