గ్రామాల్లో అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం.
కొత్తకోట పంచాయతీలో రూ. 6 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.
క్రైమ్ 9 మీడియా గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జ్. బి అమృత రాజ్.
గ్రామాల్లో అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారు పేర్కొన్నారు. గిద్దలూరు మండలం కొత్తకోట పంచాయతీలో రూ. 6,03,47,000-00 అక్షరాల ఆరు కోట్ల మూడు లక్షల నలభై ఏడు వేల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు.
భూగర్భ జలాలను పెంపొందించాలనే లక్ష్యంతో రూ. 5 కోట్ల 13 లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్ షెడ్లను, మరియు రూ. 43. 60 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని, రూ. 23.94 లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని, రూ. 20.80 లక్షలతో విలేజ్ హెల్త్ కేర్ సెంటర్ ను, మరియు కొత్తకోట పంచాయతీలో రూ. 15 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించారు.
సచివాలయ భవనంలో స్థానిక సర్పంచ్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన RO వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు.
ఈసందర్బంగా గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి మాట్లాడుతూ
గత వైసీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి చేయాలంటే పంచాయతీ నిధులు ఒక్క రూపాయి కూడా ఉండేవి కాదని, గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లిన దాఖలాలు కూడా లేవన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గ్రామాల అభివృద్ధి, రైతుల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
.jpg)

