ఆర్టీసీ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం.


 ఆర్టీసీ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జిల్లా ఒంగోలు. ప్రభుత్వ సేవలపై ప్రజల్లో సానుకూల దృక్పథం మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ చెప్పారు. శుక్రవారం ఆయన ప్రకాశం భవనంలోని తన చాంబరులో ఆర్టీసీ, రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. సకాలంలో బస్సులు గమ్యస్థానాలకు చేరేలా, బస్టాండ్లలో టాయిలెట్లు, ఇతర మౌలిక వసతుల నిర్వహణపై మరింత దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్స్ బుకింగ్, డిజిటల్ లావాదేవీలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి సులభంగా, సత్వరం సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

 ఈ సమావేశాలలో ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జి.సత్యనారాయణ, జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post