జిల్లా వ్యాప్తంగా గంజాయి సేవనం, అక్రమ రవాణా అనుమానిత ప్రాంతాలపై విస్తృత దాడులు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.



 జిల్లా వ్యాప్తంగా గంజాయి సేవనం, అక్రమ రవాణా అనుమానిత ప్రాంతాలపై విస్తృత దాడులు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.

అనకాపల్లి, డిసెంబర్ 5: అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆదేశాల మేరకు, జిల్లాలో గంజాయి సేవనం–రవాణా జరుగునని అనుమానించే ప్రాంతాలపై ఈరోజు అన్ని సబ్–డివిజన్లలో ఒకేసారి విస్తృతంగా ప్రత్యేక దాడులు నిర్వహించారు. మండలాల వారీగా ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, ప్రత్యేక బృందాలు గ్రామాలు, పల్లెలు, వాడలు, పర్వత ప్రాంతాలు, వదిలివేయబడిన భవంతులు, శివారు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ముఖ్య చర్యలు:

డ్రోన్ సర్వైలెన్స్ రోలుగుంట పరిధిలో పెడపేట, ఎం.కె.పట్నం ప్రత్యామ్నాయ గంజాయి రవాణా మార్గాలపై డ్రోన్‌తో పర్యవేక్షణ.

ఒంటరి ప్రదేశాలు, వదిలివేయబడిన భవనాలు, పాఠశాలలు, ఆలయాలు, కాలనీలు, రైల్వే స్టేషన్ పరిసరాలు, కొండ ప్రాంతాలు వంటి ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు.

అనుమానితుల వేరిఫికేషన్, ఫింగర్‌ప్రింట్ డివైస్‌తో చెకింగ్, వాహనాల తనిఖీలు, డ్రంక్ & డ్రైవింగ్ కేసులు నమోదు.

ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న పలువురిపై కేసులు నమోదు.

పలు ప్రాంతాల్లో ఎలాంటి గంజాయి వినియోగం లేదా అనుమానితులు కనబడలేదు.

కొన్నిచోట్ల గతంలో ఉపయోగించినట్లు అనిపించే ఖాళీ ప్రదేశాలు గుర్తించి స్థానిక పర్యవేక్షణ పెంపు.

గ్రామ పెద్దలు, సర్పంచ్‌లు, స్థానిక ప్రజలతో చర్చించి అవగాహన – పర్యవేక్షణ మరింత బలోపేతకం చేశారు.

గ్రామాల్లో సీసీటీవీ ఏర్పాటు, లైటింగ్ మెరుగుదల, అండర్–వాచ్ ప్రదేశాలు మూసివేత వంటి చర్యలు తీసుకోవాలని సూచనలు.

ప్రతి మండలంలో రోజు–రాత్రి బీట్‌లు ఏర్పాటు చేసి, ఇన్ఫార్మెంట్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేశారు.

దాడుల్లో సబ్–డివిజన్ అధికారులు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, ఎస్సైలు, మరియు పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది ఈ సమగ్ర ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

జిల్లాలో గంజాయి సేవనం, అక్రమ రవాణా పూర్తిగా అడ్డుకోవడానికి అనకాపల్లి జిల్లా పోలీసులు నిరంతర ప్రత్యేక చర్యలు కొనసాగిస్తారు. “మాదకద్రవ్యాల నిర్మూలన మా ప్రధాన కర్తవ్యం” అని ఎస్పీ పేర్కొన్నారు.

Post a Comment

Previous Post Next Post